బిజెపి జాతియ అధ్యక్షుడు జెపి నడ్డా రానున్న నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ప్రజల కోసం ప్రజల అలోచనకోసం పని చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.18 రాష్ట్రాలో అధికారంలో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ.ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ 303 పార్లమెంట్ స్థానాలు గెలిచి దేశాని ఏలుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ లాంటి పార్టీకి టిఆర్ఎస్ పోటీనే కాదు .
టిఆర్ఎస్ ఎంతమందికి డబుల్ బెడ్ రూం ఇచ్చింది, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది, లక్షరూపాయల రుణమాఫి చెయ్యలేదు, దలితున్ని ముఖ్యమంత్రి చెయ్యలేదు దలిత బంధు ఎందుకు ఇవ్వలేదు టిఆర్ఎస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టాట్ అయింది.ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వని పరిస్థితి ఏర్పడింది.జీతాలు ఎందుకు ఇవ్వడంలేదు ముఖ్యమంత్రి చెప్పాలి.కరెంట్ బిల్లు, నల్లా బిల్లు, బస్ ఛార్జీలు మొత్తం పెంచినవ్ పెట్రోల్ ధర తగ్గించమంటే తగ్గించవ్.భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశాలకు తట్టుకోలేక కొంతమందికి డబ్బులిచ్చి, మభ్యపెట్టి పోలీసుల ద్వారా, అధికారుల ద్వారా కేసులు పెడతామని బెదిరించి పార్టీలోకి తీసుకుంటున్నారు దాన్ని ఎవరు హర్షించరు ప్రజలు చూస్తానని తెలిపారు.
మరి కాసేపట్లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న బిజెపి జాతియ అధ్యక్షుడు జెపి నడ్డా.నడ్డా ను స్వాగతం పలకడానికి వచ్చిన కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, డీ.కె అరుణ, డాక్టర్ లక్ష్మణ్ ఎంపీ ఎయిర్ పోర్ట్ లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భారీగా మొహరించిన పోలీసులు.నడ్డా రాకతో అయనకు భారీ బందోబస్తు కోసం ప్రత్యేక బృందాలు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాయి.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి శంషాబాద్ పట్టణం వరకు భారీ ఏత్తున ఫ్లెక్సీలు జెండాలు, డయాసులు ఏర్పాటు చేశారు.