వైసీపీలో చేరి తప్పు చేశానంటూ పరిటాల సునీత కాళ్లు పట్టుకున్న టిడిపి కార్యకర్త రాప్తాడు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా.ఈ మూడున్నరేళ్లలో అభివృద్ధి కనిపించదని.
కేవలం దౌర్జన్యాలు, సెటిల్మెంట్లే కనిపిస్తాయని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు.రాప్తాడు మండలం మరూరు గ్రామంలో జరిగిన ఇదేం ఖర్మ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
స్థానిక నాయకులతో కలసి ఆమె ఇంటింటికీ వెళ్లారు.ప్రతి ఇంట్లో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు.
ప్రధానంగా నిరుద్యోగ సమస్యలు, మహిళలు పడుతున్న ఇబ్బందులు, రైతులు పడుతున్న కష్టాలు ఇలా అన్ని వర్గాల వారి కష్టాలు తెలుసుకున్నారు.పరిటాల సునీత గ్రామంలో పర్యటిస్తున్న సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.ముచ్చుమర్రి రామాంజనేయులు అనే వ్యక్తి హఠాత్తుగా వచ్చి సునీత కాళ్ల పై పడ్డారు.2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ లోకి చేరి తప్పు చేశానంటూ మాజీ మంత్రి కాళ్లు పట్టుకున్నారు.దీంతో అతన్ని పైకి లేపి ఆప్యాయంగా పలకరించారు.జరిగిందేదో జరిగిందంటూ.ఈ పార్టీలో ఎప్పటికీ మీ లాంటి వాళ్లకు చోటు ఉంటుందని తెలుగుదేశం పార్టీ కండువా కప్పారు.ఇక నుంచి పార్టీ కోసం నిర్విరామంగా శ్రమిస్తానని రామాంజినేయులు చెప్పారు.