తెలుగు బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పి వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వెండితెరపై ఈమె రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి మంచి ఆదరణ పొందారు.
ఈ సినిమా తర్వాత ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు రావడంతో బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పారు.అయితే ఈమె పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో కూడా సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.
అయితే మరోసారి స్పెషల్ సాంగ్ ద్వారా అనసూయ ప్రేక్షకులను సందడి చేయబోతుందని వార్తలు వస్తున్నాయి.
ఇంతకీ అనసూయ ఏ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతుందనే విషయానికి వస్తే ఈమె క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్గా నటించిన పుష్ప సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో సమంత తన పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు.అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ చిత్రమైన పుష్ప2 సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి.
అయితే ఈ సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ ఉండేలా సుకుమార్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

అయితే ఈ స్పెషల్ సాంగ్ చేయడం కోసం పలువురు సినీ తారల పేర్లు తెరపైకి వచ్చాయి.అయితే తాజాగా ఈ లిస్టులో అనసూయ పేరు కూడా చేరిపోయింది.ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నటువంటి అనసూయనే ఇందులో స్పెషల్ సాంగ్ చేయబోతుందని సమాచారం.
అయితే పుష్ప సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఇంతవరకు నిజం ఉందో తెలియదు కానీ, ఇది తెలిసినటువంటి నేటిజన్స్ సుకుమార్ మాత్రం అద్భుతమైన ప్లాన్ చేశారంటూ నేటిజన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.







