రేపే ‘పరిషత్’ ఫలితాలు.ఓట్ల లెక్కింపు కోసం పటిష్ట ఏర్పాట్లు ఈనెల 19వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు అవసరమైన పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అధికారులను ఆదేశించారు.
కౌంటింగ్ ఏర్పాట్లపై శుక్రవారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ సీఈవో లతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రాలతో కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ కౌంటింగ్ కు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.
కౌంటింగ్ సిబ్బంది ఏజెంట్లు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకొని ఉండాలని స్పష్టం చేశారు.కౌంటింగ్ రోజున ఆయన కౌంటింగ్ కేంద్రాలకు వంద మీటర్ల పరిధిలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించడంతో పాటు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లు పర్యవేక్షణకు జిల్లా అధికారి ఒకరిని ఇన్చార్జిగా పెట్టాలని కలెక్టర్లు కు సూచించారు.జాయింట్ కలెక్టర్లు పూర్తిస్థాయిలో కౌంటింగ్ పక్రియ బాధ్యతలు స్వీకరించాలని చెప్పారు.రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్ కృష్ణ ద్వివేది మాట్లాడుతూ.ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే వాటిని పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం తో పాటు తాము అన్ని వేళలా సిద్ధంగా ఉంటామని తెలిపారు.
కౌంటింగ్ కు సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాలలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని.
అయినప్పటికీ జనరేటర్ కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు.స్ట్రాంగ్ రూం నుండి కౌంటింగ్ హాల్లోకి బ్యాలెట్ బాక్స్ ను తీసుకు వచ్చే సమయంలో పూర్తిగా సీసీటీవీ కవరేజ్ చేయాలని చెప్పారు.
శాంతిభద్రతల అదనపు డీజీపీ రవిశంకర్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి కె.కన్నబాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.