బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి పరిణితి చోప్రా ( Parineeti Chopra ) ఈనెల 24వ తేదీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను( Raghav Chadha ) ఉదయపూర్ లోని లీలా ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా వీరి వివాహ వేడుకకు సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అలాగే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక వీరి వివాహం కొంతమంది కుటుంబ సభ్యులు సన్నిహితులు పలువురు రాజకీయ నాయకుల సమక్షంలో జరిగిందని చెప్పాలి.ఇక వీరి పెళ్లికి ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా( Saniya Mirza ) తన చెల్లెలు అనమ్ తో కలిసి వచ్చింది.అయితే ఆమె పరిణీతి పెళ్లిలో దిగిన ఒక ఫోటోని సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
ఇలా పెళ్లికి వెళ్లిన వారందరికీ ఈమె రిటర్న్ గిఫ్ట్స్ ( Return Gift ) కింద కొన్ని కానుకలు ఇచ్చారట అయితే ఈ కానుకలకు సంబంధించినటువంటి ఫోటోని సానియా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.అయితే ఈ ఫోటోలో సానియా మీర్జా చేతిలో ఉన్నటువంటి వైట్ కర్చీఫ్ అందరిని ఆకట్టుకుంది.

ఇలా పరిణితి చోప్రా పెళ్లికి వెళ్లినటువంటి వారికి రిటన్ గిఫ్ట్స్ లో భాగంగా చిన్న గిఫ్ట్ బాక్స్ లో ఒక వైట్ ఖర్చు ఉంది అలాగే అందులో నా పెళ్లికి వచ్చిన వారందరూ నా పెళ్లి చూసి కన్నీళ్లు వస్తే కనుక ఈ కర్చీఫ్ తో తుడుచుకోండి అని రాసి ఉందట.ఇలాంటి గిఫ్ట్ను పరిణితి చోప్రా ఇవ్వడంతో సానియా మీర్జా ఈ గిఫ్ట్ సంబంధించినటువంటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.దీంతో ప్రతి ఒక్కరు ఈ గిఫ్ట్ పై విభిన్న రకాలుగా కామెంట్ చేస్తున్నారు.అలాగే ఈ రిటర్న్ గిఫ్ట్స్ పై కొందరు సెటైర్స్ వేస్తూ నటి పరిణితి పై ట్రోల్స్ మొదలుపెట్టారు.







