దొరికింది కదా అని లాగించేసిన బ్యూటీ.. ఏమిటో తెలుసా?

స్టార్స్ చేసే ఏ పనైనా ఒక్కసారి సోషల్ మీడియాలో పడితే అది వైరల్ కావడమో, లేక వారి పరువు తీయడమో చేస్తుంది.ఇలాంటి ఘటనలు మనం చాలానే చూశాం.

 Parineeti Chopra Eating Snow-TeluguStop.com

కొందరు పేరు సంపాదించేందుకు సోషల్ మీడియాను వాడుకుంటే, మరికొంతమంది కేవలం టైంపాస్ కోసమే సోషల్ మీడియాను వాడుకుంటారు.ఇలాంటి వారు ఏది చేసినా వైరల్ అవుతుందని వారి నమ్మకం.

కాని కొన్నిసార్లు వారు చేసే పనులు వారిని నవ్వులపాలు చేస్తుంటాయి.

తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది.

బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రాకు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది.అందంతో పాటు అభినయంతోనూ అమ్మడు అభిమానులను సంపాదించుకుంది.

అయితే ఈ మధ్య సినిమాలు ఎక్కవగా లేని ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటుంది.తాజాగా అమ్మడు చేసిన ఓ పనికి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

మంచు కొండల్లో మంచు గడ్డలను ఏరుకుని తింటూ ఈ అమ్మడు ఓ వీడియో చేసింది.

అది కాస్త సోషల్ మీడియాలో పడటంతో పరిణీతి చోప్రా ఇంకా చిన్నపిల్లలా ప్రవర్తించడం ఏమిటంటూ ఆమెపై పలువురు గుర్రుమంటున్నారు.

కాగా ఎవరి ఇష్టం వారిది అంటూ పలువురు ఆమెకు సపోర్ట్ ఇస్తున్నారు.ఏదేమైనా ఇలాంటి చిన్న పనులు కూడా వారిని వార్తల్లో నిలబెడతాయనడానికి ఈ ఘటన ఉదాహరణ అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube