యాదాద్రి భువనగిరి జిల్లా: మోత్కూరు మండలం దాచారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు తాళం వేసి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో 50 మంది నిరుపేద విద్యార్దులు చదువుతుండగా నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారని,వారిలో ఒకరిని బదిలీ చేయగా,ముగ్గురే ఉన్నారని,అందులో కూడా ఒకరిని వేరే చోటికీ పంపే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠశాల పునఃప్రారంభ సమయంలో ఎంఈఓ, ఉపాధ్యాయులు తల్లిదండ్రుల వద్దకు వచ్చి మీ పిల్లలను సర్కార్ బడికి పంపండి,చదువు గ్యారెంటీ మేము ఇస్తామని చెప్పి,ఇప్పుడు ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులను వేరే చోటికి పంపిస్తే పిల్లల చదువులు ఏం కావాలని ప్రశ్నించారు.మా పాఠశాల టీచర్లను వేరే చోటికి పంపడం వల్ల విద్యార్దులు నష్టపోతారని,విద్యా శాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఇక్కడి ఉపాధ్యాయులను ఇక్కడే ఉంచాలని డిమాండ్ చేశారు.
లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.