మామూలుగా ఈ మధ్యకాలంలో కొందరు ప్రజలు తమకు ఆడపిల్లలు జన్మిస్తే పురిట్లోనే గొంతు నులిమి చంపేస్తున్న ఘటనలు చాలానే మనం చూస్తూ ఉంటాం.కానీ అక్కడ మాత్రం తమ కుటుంబంలో ఎవరికైనా ఆడపిల్ల జన్మిస్తే సంబరాలు చేసుకుంటారు.
అయితే ఈ సంబరాలు దేనికంటే ఆ ఆడపిల్ల వ్యభిచారంలో పాల్గొని తన కుటుంబాన్ని పోషిస్తోంది కాబట్టి.ఇలాంటి మనస్తత్వం కలిగి ఉన్న ప్రజలు జీవిస్తున్న ఓ గ్రామం గురించి కూడా తెలుసుకుందాం.
భారతదేశంలోని మధ్య ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులలో ఇప్పటికీ కొన్ని పురాతన జాతులకు చెందిన తెగల ప్రజలు నివశిస్తున్నారు.అయితే ఇందులో కొందరు వ్యవసాయాన్ని తమ వృత్తిగా చేసుకొని బ్రతుకుతున్నారు.
కానీ మరికొందరు మాత్రం వ్యభిచారాన్ని తమ వృత్తిగా చేసుకుని బ్రతుకుతున్నారు.అయితే ఈ క్రమంలో తమ ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్లే ఆడ పిల్లలతో వ్యభిచారం చేస్తున్నట్లు పలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
అయితే ఇందుకు గల కారణాలు లేక పోలేదు.గతంలో ఈ తెగలకి చెందిన పౌరులు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతున్నారని తెలిసి బ్రిటిష్ వాళ్ళు వీరిని అణచి వేసేందుకు పలు ప్రయత్నాలు చేశారు.
ఇందులో భాగంగా వీరికి వ్యవసాయ భూములపై హక్కులు లేకుండా నిషేధించారు.దీంతో ఈ తెగకు సంబంధించిన ఆడవాళ్ళు వ్యభిచార వృత్తిని ఎంచుకొని తమ కుటుంబాన్ని పోషించే పనిలో పడ్డారు.