సంజయ్ దత్తును క్షమించేది లేదు

అక్రమంగా ఆయుధాలు దాచిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ హీరో సంజయ్ దత్తును క్షమించకూడదని మహారాష్ట్ర గవర్నర్ సి హెచ్ విద్యాసాగర్ రావు నిర్ణయించారు.

సంజయ్ క్షమాభిక్ష విజ్ఞప్తిని రాష్ట్ర హోం శాఖ సిఫారసు మేరకు గవర్నర్ తిరస్కరించారు.

సంజయ్ కు క్షమా భిక్ష పెట్టి విడుదల చేయాలని 2013 లో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జు ప్రభుత్వానికి పిటిషన్ పెట్టారు.అయితే సంజయ్ ప్రవర్తన చేదుగా ఉందని గతంలో సుప్రీం కోర్టు కూడా అభిప్రాయ పడటంతో గవర్నర్ క్షమా భిక్ష పెట్టడానికి అంగీకరించలేదు.1993 లో ముంబైలో జరిగిన బాంబు దాడులతో సంజయ్ కు సంబంధం ఉందన్న ఆరోపణలు వచ్చాయి.2013లో ఇతన్ని దోషిగా కోర్టు తీర్పు చెప్పింది.2007లో ఆరేళ్ళ జైలు శిక్ష పడింది.18 నెలల తరువాత బెయిల్ మీద బయటకు వచ్చాడు.న్యాయ పోరాటం చేసాడు.

చివరకు 2013లో ఆయన నేరం నిర్ధారణ కావడంతో మళ్ళీ జైలుకు పంపాలని కోర్టు ఆదేశించింది.సంజయ్ శిక్షా కాలం 2016 ఫిబ్రవరిలో పూర్తీ అవుతుంది.

వెక్కి వెక్కి ఏడ్చిన ఫుట్ బాల్ దిగ్గజం.. వైరల్ వీడియో
Advertisement

తాజా వార్తలు