శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) సమంత( Samantha )జంటగా నటించిన చిత్రం ఖుషి( Kushi ).ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
చాలా రోజుల నుంచి ఏ విధమైనటువంటి హిట్ సినిమాలు లేక ఎంతో సతమతమవుతున్నటువంటి విజయ్ దేవరకొండకు ఖుషి సినిమా మంచి విజయాన్ని అందించిందని చెప్పాలి.అయితే తాజాగా ఈ సినిమా గురించి పరుచూరి గోపాలకృష్ణ ( Parachuri Gopala Krishna ) తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఖుషి సినిమా అనగానే పవన్ కళ్యాణ్ సినిమాని గుర్తుకొస్తుంది కానీ ఈ సినిమాలో ప్రేమలో పడటానికి ముందు ప్రేమలో పడిన సమయంలోను, పెళ్లి జరిగాక ఒక జంట మధ్య ఎలాంటి గొడవలు వస్తాయి అనే విషయాలను చూపించారని తెలిపారు.

ఈ సినిమాలో సమంత విజయ్ దేవరకొండ నటన అద్భుతమని పరుచూరి తెలియచేశారు.ఈ సినిమా కథ కేవలం ఒక అమ్మాయి అబ్బాయి మధ్య జరిగే సినిమాల కాకుండా వారి తల్లిదండ్రుల మధ్య జరిగే సినిమాగా కూడా చూపించారని వారి తండ్రుల మధ్య చిన్న చిన్న పదాలను చూపిస్తూ వారి పెళ్లికి వీరు పెద్దలు ఒప్పుకుంటారా అన్న సందేహాలను డైరెక్టర్ క్రియేట్ చేశారు.ఇక వీరిద్దరూ కూడా తమ ప్రేమకు కుటుంబ సభ్యులను ఎలా ఒప్పించగలిగారు అన్నది పెద్ద ట్విస్ట్ గా ఉందని పరుచూరి పేర్కొన్నారు.
ఇక ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని హీరో హీరోయిన్స్ మధ్య ప్రేమ డెవలప్ కాకపోయి ఉంటే అది అన్ వాంటెడ్ డ్రామా అయి ఉండేదని పరుచూరి తెలిపారు.

ఒక సూపర్ హిట్ సినిమా పేరును ఈ సినిమాకు పెట్టి వీరి అద్భుతమైన నటనతో ఇలాంటి సినిమాని క్రియేట్ చేయడం ఒక సవాల్ అని చెప్పాలి.ఈ సినిమా కథ చాలా చిన్నదే కానీ ఈ సినిమాని రెండున్నర గంటల పాటు నడిపించడం సులభం కాదని పరుచూరి తెలిపారు.ఒక చిన్న పాయింట్ పై స్క్రీన్ ప్లే ఎలా రాయాలో కూడా దర్శకుడు ఇలా చూపించారని పరుచూరి గోపాలకృష్ణ ఖుషి సినిమా ( Kushi )పట్ల తన అభిప్రాయాలను తెలియజేశారు.
మొత్తానికి ఈ సినిమాకి పరుచూరి తన పాజిటివ్ రివ్యూ ఇచ్చారని చెప్పాలి.







