వ్యవసాయంలో అధిక దిగుబడి సాధించాలంటే ఎరువుల యాజమాన్యంతో పాటు నీటి పారుదల విషయంలో కొన్ని సరైన మెళుకువలు పాటించాలి.బొప్పాయి( Papaya ) అధికంగా పోషక విలువలను కలిగి ఉంటుంది.
ఆరోగ్యపరంగా మంచి పౌష్టిక ఆహారం కావడం వల్ల మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది.అయితే రైతులు సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తేనే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.

బొప్పాయి పంటకు ఎర్రగరప నేలలు, నల్లరేగడి నేలలు చాలా అనుకూలం.పొలంలో నీరు నిల్వ ఉండకుండా పొలాన్ని చదును చేసుకోవాలి.వేసవిలో లోతు దిక్కులు దున్నుకొని, పొలంలో ఇతర పంటల అవశేషాలను పూర్తిగా తొలగించాలి.ఒక హెక్టారు పొలంలో ఐదు టన్నుల పశువుల ఎరువు వేసి కలియ దున్నుకోవాలి.
ఆ తర్వాత ప్రతి మొక్కకు 250 గ్రాముల యూరియా ఎరువులను ప్రతి నెలలకు ఒకసారి చొప్పున మొక్కలు నాటిన రెండు నెలల తర్వాత నుంచి ప్రారంభించి 6 మోతాదులుగా వేయాలి.అప్పుడే మొక్కకు కావలసిన పోషకాలు సంపూర్ణంగా అంది ఆరోగ్యవంతంగా పెరిగి మంచి దిగుబడి ఇస్తాయి.

బొప్పాయి పంటలో నీటిపారుదల అనేది ఎంతో కీలకం.మాములుగా నీటిని పారిస్తే నీరు వృధా అవ్వడంతో పాటు కలుపు సమస్యలు అధికం అవుతాయి.కాబట్టి డ్రిప్ విధానం( Drip Irrigation ) ద్వారా నీటిని అందించాలి.చిన్న మొక్కలు అయితే రెండు రోజులకు సుమారు ఎనిమిది నుంచి పది రోజులకు ఒకసారి నీటిని అందించాలి.
అదే పెద్ద మొక్కలైతే ప్రతి రోజు 20 లీటర్ల నీటిని ప్రతి మొక్కకు అందించాల్సి ఉంటుంది.వేసవికాలంలో నాలుగు రోజులకు ఒకసారి చలికాలంలో 10 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి.
పూత వచ్చిన నాలుగు నెలలకు కాయ తయారవుతుంది. కాయ పసుపు రంగులోకి మారిన తర్వాతనే పండును కోయాలి.
ఆయన మొక్కపై మాగనివ్వరాదు.ఒక ఎకరం పొలంలో 30 టన్నుల దిగుబడి పొందవచ్చు.







