బాడీగార్డును ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ నటి.. కారణం?

ఇటీవల టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుసగా పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే.ఇక బాలీవుడ్, టాలీవుడ్ నటులు కూడా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.

ఇక హాలీవుడ్ స్టార్ నటి తన బాడీ గార్డ్ ను పెళ్లి చేసుకుంది.ఇదివరకే ఐదు పెళ్లిళ్లు చేసుకున్న హాలీవుడ్ నటి.బాడీగార్డ్ తో ఆరవ పెళ్లి చేసుకుంది‌.మొత్తానికి ఈ పెళ్లి చేసుకున్న బాడీగార్డ్ సురక్షితంగా ఉన్నానంటూ పలు విషయాలు తెలిపింది.

ఇంతకీ ఆ నటి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా.హాలీవుడ్ నటి పమేలా అండర్సన్.

ఈమె బేవాచ్ సీరియల్ ద్వారా పరిచయమైన నటి.గత ఏడాది రహస్యంగా పెళ్లి చేసుకున్న విషయాన్ని అభిమానులతో పంచుకుంది పమేలా.కరోనా వైరస్ లాక్ డౌన్ సమయం లో పమేలా డాన్ హేహెర్ద్స్ తో ప్రేమలో పడిందట.

Advertisement

ఇక అతడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో గత ఏడాది కెనడాలోని తన వ్యాన్ కౌవేర్ ఐలాండ్ లో కొద్దిమంది బంధువుల సమక్షంలో క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకుంది.

ఇక తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.కొన్ని విషయాలు తెలుపుతూ. నిజంగా నన్ను ప్రేమించే వ్యక్తి చేతిలో ఇప్పుడు నేను సురక్షితంగా ఉన్నానని ఖచ్చితంగా చెప్పగలను అంటూ.

అతడితో కలిసి ఉన్న ఒక్క ఏడాది నాకు ఏడు జన్మల బంధం గా అనిపిస్తుంది అని తెలిపింది.గత ఏడాది ఆమె ప్రముఖ హాలీవుడ్ నిర్మాత జాన్ పీటర్ ను ఐదవ పెళ్లి చేసుకోగా అతనితో 12 రోజులకే విడిపోయినట్టు తెలిపి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఆ తర్వాత ఒంటరిగా ఉన్న తనకు లాక్ డౌన్ సమయంలో తన బాడీ గార్డ్ పరిచయం కాగా రహస్యంగా 6వ పెళ్లి చేసుకుంది.ఇక తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది.

శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!
Advertisement

తాజా వార్తలు