గత వారం బిగ్ బాస్ హౌస్ లో ‘ఏవిక్షన్ పాస్‘ టాస్కు ఎంత హోరాహోరీ వాతావరణం మధ్య జరిగిందో మనమంతా చూసాము.ఈ టాస్కు లో యావర్ నాలుగు ఆటలు గెలిచి ‘ఏవిక్షన్ పాస్’ ని సొంతం చేసుకున్నాడు.
కానీ అతను ఆడిన నాలుగు ఆటల్లో రెండు ఆటలు ఫౌల్ ఆడాడు.ఇది మొన్న వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున వీడియో లు వేసి చూపించడం తో యావర్ ( Prince Yawar )ఈ ‘ఏవిక్షన్ పాస్’ ని తిరిగి ఇచ్చేసాడు.
ఈ సంఘటన తో యావర్ ప్రేక్షకుల దృష్టిలో హీరో అయిపోయాడు.నిజాయితీగా ‘ఏవిక్షన్ పాస్’ ని వెనక్కి ఇచ్చేసి యావర్ తన క్యారక్టర్ ని కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు తెలియజేసాడు అంటూ సోషల్ మీడియా లో ఆయన గ్రాఫ్ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది.
అయితే ఈ వారం కూడా ఏవిక్షన్ పాస్ గేమ్ ఉంటుంది అని నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ లో తెలియజేసాడు.
బిగ్ బాస్ చెప్పినట్టుగానే నేడు ‘ఏవిక్షన్ పాస్’ టాస్కు కంటెస్టెంట్స్ అందరి మధ్య హోరాహోరీగా జరిగింది.ఈ టాస్కులో చిన్న కర్ర మీద బిగ్ బాస్ చెప్పిన ఐటమ్స్ ని పెడుతూ బ్యాలన్స్ చెయ్యాలి.ఈ టాస్కులో ముందుగా శోభా శెట్టి బ్యాలన్స్ చెయ్యలేక ఓటు అయిపోతుంది.
ఆ తర్వాత శివాజీ అవుట్ అయిపోతాడు.ఆయనకి ఉన్న చేతి నొప్పికి అంతసేపు మొయ్యడం చాలా ఎక్కువ అని అందరికీ అనిపించింది.
వీళ్లిద్దరి తర్వాత ప్రిన్స్ యావర్ బ్యాలన్స్ తప్పిపోయి క్రింద పడేస్తాడు.ఆ తర్వాత రతికా, ఆమె అవుట్ అయిపోయిన కాసేపటికి గౌతమ్ కూడా అవుట్ అయిపోతాడు.
ఇక అర్జున్ ,అమర్ దీప్, అశ్విని, పల్లవి ప్రశాంత్ మరియు ప్రియాంక జైన్ మిగులుతారు.ఆ తర్వాత అమర్ దీప్, అర్జున్ మరియు అశ్విని ఎలిమినేట్ అవ్వగా, చివరికి ప్రియాంక మరియు పల్లవి ప్రశాంత్ గేమ్ లో మిగులుతారు.
ఈ ఇ
ద్దరి మధ్య చాలాసేపటి వరకు హోరాహోరీ పోరు జరగగా, చివరికి పల్లవి ప్రశాంత్ గెలుస్తాడు.పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) గెలిచినప్పటికీ కూడా, చివరి వరకు అతనితో సమానంగా బ్యాలన్స్ చేసిన ప్రియాంక గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి.ఇంట్లో ఉన్న వాళ్లందరికి వంట చేసి పెట్టే ప్రియాంక( Priyanka Jain ) లో టాస్కులు ఆడేంత బలం ఉండదు.కానీ ఆమె ఇన్ని రోజులు ప్రతీ టాస్కులోనూ తన బెస్ట్ ని ఇస్తూ వచ్చింది.
ఈరోజు జరిగిన టాస్కులో కూడా తన హైట్ కి, తనకి ఉన్న చిన్న చేతులతో బ్యాలన్స్ చెయ్యడం చాలా కష్టం.కానీ ఆమె చేసి చూపించింది, ఇదే ఇప్పుడు అందరినీ ఆమెకి సపోర్టు చేసేలా చేస్తుంది.
ఇదే ఊపులో ఆమె తన ఆటలను ఆడుతూ ముందుకు దూసుకుపోతే కచ్చితంగా టాప్ 3 లో ఒక స్థానం లో స్థిరపడుతుందని అంటున్నారు విశ్లేషకులు.