అర్హులైన ప్రతి జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి ఏళ్లతరబడి పెండింగ్ లో ఉన్న జర్నలిస్ట్ ల ఇళ్ల స్థలాల సమస్యను సీఎం కేసీఆర్, టీయూ డబ్ల్యూజే నాయకత్వం చేసిన కృషివల్లే సుప్రీంకోర్టు జర్నలిస్టులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ పేర్కొన్నారు.ఖమ్మంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్, ప్రెస్ అకాడెమీ ఛైర్మెన్ అల్లం నారాయణకు, యూనియన్ గౌరవ సలహాదారు ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి జర్నలిస్టు లు అభినందనలు తెలిపారు.
సుప్రీంకోర్టులో ఉన్న కేసును ఎలాగైతే పరిష్కారం చేశారో ఆ విధంగానే జిల్లాలో ఉన్న అర్హులైన ప్రతి జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎలాగైతే ముందుండి ఉద్యమం నడిపారో ఆ విధంగానే అల్లం నారాయణ, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ లు సీఎం కేసీఆర్ చొరవతో సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు జర్నలిస్టుల ఇండ్ల స్థలాల ఆవశ్యకతను తెలియజేశారని అన్నారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులు రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూయుజే (టీజేఎఫ్) ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రాజు, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నాగరాజు,నాయకులు చిర్రా రవి, కొత్త యాకేశ్,శెట్టి రజినీకాంత్, గుద్దేటి రమేష్,మందడపు రమణ, అమరవరపు కోటేశ్వరరావు, కెవి, ముత్యాల కోటేశ్వరరావు, సంతోష్,కొరకొప్పుల రాంబాబు, కంచర్ల శ్రీనివాస్, చక్రవర్తి, తిరుపతిరావు, గోపి, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.