తాజాగా ఆసియా కప్ టోర్నీలో( Asia Cup tournament ) భాగంగా తొలి సూపర్-4 రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్( Bangladesh ) పై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది.పాకిస్తాన్ బౌలర్లైన హరీస్ రవుస్ 4, నసీమ్ షా 3 వికెట్లు తీసుకొని బంగ్లాదేశ్ జట్టు బ్యాటర్లను కట్టడి చేయగా.
పాకిస్తాన్ ( Pakistan )బ్యాటర్లైన ఇమామ్ ఉల్ హక్ 78, మహమ్మద్ రిజ్వాన్ 63 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ లతో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డారు.దీంతో సూపర్-4 తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పై ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 38.4 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది.బంగ్లాదేశ్ బ్యాటర్లైన ముష్పికర్ రహీమ్ 64( Mushpikar Rahim ), కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 53 పరుగులతో రాణించారు.మిగిలిన బంగ్లాదేశ్ బ్యాటర్లు చాలా ఘోరంగా విఫలమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య చేదనకు దిగిన పాకిస్తాన్ జట్టు 39.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 194 పరుగులను ఆడుతూ పాడుతూ చేసేసి విజయం సాధించింది.పాకిస్థాన్ పేసర్లు హరీస్ రవుస్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

ఈ మ్యాచ్లో పాకిస్తాన్ పేసర్లు అద్భుత ఆటను ప్రదర్శించారు.పాకిస్తాన్ పేసర్ల దెబ్బకు బంగ్లాదేశ్ కనీసం 200 మార్క్ కూడా దాటలేకపోయింది.తొలి పవర్ ప్లే లో బంగ్లాదేశ్ 47 పరుగులకే ఏకంగా నాలుగు వికెట్లను కోల్పోయింది.
ఒక్క మాటలో చెప్పాలంటే పాకిస్తాన్ పేసర్ల ముందు బంగ్లాదేశ్ బ్యాటర్లు తేలిపోయారు.ఇక టార్గెట్ చిన్నదే కాబట్టి పాకిస్తాన్ ఎటువంటి కంగారు పడకుండా నెమ్మదిగా పరుగులు చేసింది.
ఇమామ్ ఉల్ హక్, రిజ్వాన్ అద్భుత ఆటను ప్రదర్శించి అర్థ సెంచరీలతో రాణించారు.పాకిస్తాన్ సొంత గడ్డపై ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టి విజయం సాధించింది.







