Mahnoor Baloch Shahrukh Khan: షారుఖ్ కు నటన రాదు.. అందగాడేం కాదు.. ఈ నటి కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ పై( Shahrukh Khan ) తాజాగా పాకిస్తాన్ కు చెందిన నటి సంచలన వ్యాఖ్యలు చేసింది.

షారుఖ్ ఖాన్ అసలు అందగాడే కాదని, అతనికి నటన రాదని, అతను కేవలం వ్యాపారవేత్త, తనను తాను ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలో ఆయనకు బాగా తెలుసు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఆ నటి మరెవరో కాదు.నటి మహనూర్ బలోచ్.

( Mahnoor Baloch ) పాకిస్తాన్ కు చెందిన ఈమె మోడల్ మాత్రమే కాకుండా దర్శకురాలు కూడా.హాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించింది.

తాజాగా ఒక పాకిస్తాని టాక్ షోలో పాల్గొన్న మ‌హ‌నూర్ బ‌లోచ్ షోలో మాట్లాడుతూ.

Advertisement

షారుఖ్ ఖాన్ చాలా మంచి వ్య‌క్తిత్వం క‌లిగిన మ‌నిషి, అందం ప‌రంగా చూస్తే ఆయ‌న పెద్ద అంద‌గాడు మాత్రం కాదు.ఆయ‌న వ్య‌క్తితం, తేజ‌స్సు చాలా బ‌ల‌మైన‌వ‌ని.అవే ఆయ‌న్ను గొప్ప‌వాడిని చేసింది అని చెప్పుకొచ్చింది.

అలాగే స‌మాజంలో ఎంతో మంది అంద‌గాళ్లు ఉంటార‌ని, ఆక‌ర్షించే తేజ‌స్సు, చ‌లాకీత‌నం లేక అనామ‌కులుగా మిగిలిపోతున్నారు అని ఆమె తెలిపింది.షారుఖ్ ఖాన్ కు నటన కూడా రాదని, ఆయ‌నో గొప్ప బిజినెస్ మ్యాన్.

త‌న‌ను తాను ఎలా మార్కెట్ చేసుకోవాలో బాగా తెలుసు.

ఈ విష‌యంలో షారుక్ అభిమానులు, కొంద‌రు నాతో ఏకీభ‌వించ‌క‌పోవ‌చ్చు కానీ ఇవే నిజాలు అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది మహనూర్ బలోచ్. ఈ సందర్భంగా ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఒక రేంజ్ లో విడుచుకుపడుతున్నారు.ఆమెపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ కూడా చేస్తున్నారు.

ఇదేందయ్యా ఇది.. కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న హీరోయిన్..
ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !

ఇంకొందరు ఆ వీడియో పై స్పందిస్తూ ప‌బ్లిసిటీ కోస‌మే ఆమె షారుఖ్ ఖాన్ పై విమ‌ర్శ‌లు చేసింద‌ని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఇకపోతే షారుఖ్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే.

Advertisement

షారుఖ్ ఖాన్ తాజాగా నటిస్తున్న జవాన్ సినిమా( Jawan Movie ) సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా తెరకెక్కబోతోంది.

తాజా వార్తలు