పాకిస్థాన్( Pakistan ) ప్రస్తుత పరిస్థితుల గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు.రానురాను అక్కడి ఆర్థిక సంక్షోభం చాలా దయనీయ స్థితికి దిగజారిపోతోంది.
ద్రవ్యోల్బణం, రాజకీయ అనిశ్చితి వంటి కారణాలతో దాయాది దేశం పరిస్థితి దయనీయంగా వుంది.ఫారెక్స్ నిల్వలు బాగా తరిగిపోతున్న ఈ క్రమంలో పాకిస్థాన్ కొత్తగా కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటోంది.
విషయం ఏమంటే, చరిత్రలో ఫస్ట్ టైం పాకిస్థాన్ రూపాయి విలువ డాలర్‌తో పోల్చితే కనిష్ఠ స్థాయికి దిగజారింది.

అంటే ఒక డాలర్ కొనుగోలు చేయాలంటే పాకిస్థాన్ ఇపుడు 301 రూపాయలు చెల్లించుకోవాల్సిన పరిస్థితి అంటే అర్ధం చేసుకోండి, పాకిస్థాన్ రూపాయి పరిస్థితి ఏ స్థాయిలో దిగజారిందో.ఇదే సమయంలో ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో ఒక డాలర్ ధర రూ.299గా నమోదైంది.దీనివల్ల దిగుమతులు మరింత ప్రియం కానున్నాయి.పాకిస్థాన్ ప్రభుత్వ ఖజానా ఖాళీ అవటంతో దేశం భారీ అప్పుల ఊబిలో కూరుకు పోయింది.

గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు కొన్ని పాకిస్థాన్ దివాళా తీసినట్లు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.అవును, పాక్ ప్రస్తుతం నగదు కొరతతో కొట్టుమిట్టాడుతోంది.దీనికి తోడు విపరీతంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రజలపై భారాన్ని మోపుతున్నాయి.ఉదాహరణకు అక్కడ కిలో చికెన్ ధర రూ.437, గుడ్లు డజను రూ.275, పిండి రూ.135, దుంపలు కిలో రూ.78, డీజిల్ లీటరు రూ.289, పాలు లీటరు రూ.168, పెట్రోల్ లీటరు రూ.283గా కొనసాగుతున్నాయి.ధరలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో పాక్ లో ద్రవ్యోల్బణం ప్రతి నెల కొత్త గరిష్ఠాలకు చేరుకుంటోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఏప్రిల్ నెలలో ఇది గరిష్ఠంగా 36.4 శాతానికి చేరుకుంది.ఇది ఆర్థికంగా దివాలా తీసిన శ్రీలంకలో ఉన్న ద్రవ్యోల్బణం రేటు కంటే ఎక్కువ కావటం ఇపుడు సర్వత్రా ఆందోళనలకు గురి చేస్తోంది.







