ప్రస్తుతం భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) టోర్నీలో పాకిస్తాన్ ( Pakistan ) పాల్గొంటుందా.లేదా అనే విషయంలో ఇప్పటివరకు పూర్తి స్పష్టత రాలేదు.
ఐసీసీ ( ICC ) ఎన్నో చర్చలు జరిపిన ఫలితం మాత్రం శూన్యం అనే అనిపిస్తుంది.నిన్నటిదాకా పాకిస్తాన్ వేదికగా జరిగే ఆసియా కప్ టోర్నీ లో భాగంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎన్నో చర్చలు జరిపి చివరకు హైబ్రిడ్ మోడల్ ను ప్రకటించింది.
దీనికి ఆసియా కప్ టోర్నీలో పాల్గొనే దేశాలు అంగీకరించాయి.భారత్ ఎట్టి పరిస్థితుల్లో ఆసియా కప్ టోర్నీ కోసం పాకిస్తాన్ కు వెళ్ళేది లేదని బీసీసీఐ స్పష్టంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే.
దీంతో హైబ్రిడ్ మోడల్ లో భాగంగా టోర్నీలో జరిగే 13 మ్యాచ్లలో నాలుగు మ్యాచ్లు పాకిస్తాన్లో, మిగిలిన 9 మ్యాచులు శ్రీలంకలో నిర్వహించడంపై బీసీసీఐ తో పాటు టోర్నీలో పాల్గొనే మిగతా దేశాల బోర్డులు ఆమోదించాయి.ఇక పాకిస్తాన్ ఆసియా కప్ టోర్నీ విషయంలో తన పంతం నెగ్గించుకోలేకపోయింది.
ప్రస్తుతం తెరపై భారత్లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పాల్గొంటుందా.లేదా, అనేది స్పష్టం కాలేదు.కానీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ హైబ్రిడ్ మోడల్ ను ప్రకటించిన తరువాత పీబీసీ చైర్మన్ నజాం సేథి( Najam Sethi ) మీడియా ముందు వన్డే వరల్డ్ కప్ గురించి స్పందిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

వన్డే వరల్డ్ కప్ కు సంబంధించిన ఎటువంటి నిర్ణయాలైన పాకిస్తాన్, భారత్ దేశాలు తీసుకుంటాయని తెలిపారు.బీసీసీఐ, పీబీసీ సొంతంగా నిర్ణయాలు తీసుకోలేవని స్పష్టం చేశారు.పాకిస్తాన్ ప్రభుత్వం భద్రతను పరిశీలించి అనుమతి ఇస్తే ఖచ్చితంగా భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు పాల్గొంటుంది లేకపోతే లేదని తెలిపారు.
కాబట్టి ఈ విషయంలో ఇరుదేశ ప్రభుత్వాలదే తుది నిర్ణయం అవుతుందని తెలిపారు.

ఆసియా కప్ ఆతిథ్య హక్కులు మొత్తం పాకిస్తాన్ వద్దే ఉన్నాయి.అయితే భారత్ మాత్రం పాకిస్తాన్ కు రావడానికి నిరాకరించింది.తరువాత హైబ్రిడ్ మోడల్ ను బీసీసీఐ సహా మిగిలిన దేశాలు ఆమోదించాయి.
తరువాత ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కు సంబంధించిన షెడ్యూల్ ను పీసీబీకు పంపించి, పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని తెలిపింది.ఈ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని త్వరలోనే నిర్ణయం ప్రకటించబడుతుందని పాకిస్తాన్ బోర్డు చీఫ్ తెలిపారు.







