ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కంచుకోటని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు కోసమే పాదయాత్రని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు.ఈ క్రమంలో విద్యుత్ బకాయిలపై చర్చ జరగాలని పేర్కొన్నారు.
ప్రైవేట్ విద్యుత్ కొనుగోలుపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.ధరణి పోర్టల్ పెద్ద కుంభకోణమని ఆరోపించారు.
సంగారెడ్డి, రంగారెడ్డి భూములపై విచారణ చేయాలని కాంగ్రెస్ తరపున డిమాండ్ చేశారు.







