తానా తెలుగు పోటీలు..ప్రారంభం....

తానా తన వార్షికోత్సవం కోసం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలని వేగంగా నిర్వహిస్తోంది.తానా తరుపున పాఠశాలలో పిల్లలకి తెలుగు పోటీలు ప్రారంభించాలని అనుకున్న కార్యక్రమాని నిర్వహించింది.

కొలంబస్ ఒహాయో లో పాటశాలలో డైరెక్టర్ కాళీ ప్రసాద్ మావులేటి నిర్వహణలో ఆ పట్టణంలో ఉన్న తానా నాయకుల సహాయంతో ఎట్టకేలకి “పాఠశాల తానా తెలుగు పోటీలు 2019” మొదలయ్యాయి.ఇదే కార్యక్రమం వచ్చే వారం నుంచీ వరుసగా ఒకటి లేదా రెండు చోట్ల ఈ పోటీల నిర్వాహణకి ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి.

అనేక చోట్ల నుంచి పోటీలు నిర్వహించటానికి ముందు వారికి తానా నుంచీ తమ పోటీలని నిర్వహించవలసినదిగా కోరుతున్నట్లుగా తానా తెలుగు పోటీల నిర్వాహకులు తెలిపారు.ఈ పోటీలని మరిన్ని ఎక్కువ చోట్ల నిర్వహించడానికి సిద్దంగా ఉన్నామంటూ తెలిపుతున్నారు.

మీమీ ప్రాంతం లో తెలుగు చిన్నారుల కోసం ఈ పోటీలు నిర్వహించాలని అనుకునే వారు ఎవరన్నా ఉంటే మమ్మల్ని సంప్రదించ వచ్చునని వెబ్సైటు చిరునామా ఇచ్చారు www.paatasala.net/telugupoteelu ఒక వేళ తమ ద్వారా ఈ పోటీలు నిర్వహించాలని అనుకుంటే పోటీలు జరపడానికి ఓ స్కూల్ గాని, గుడిలో కానీ, ఒక ఆఫీస్ లో కానీ ఏర్పాటు చేసుకుని జూన్ చివరి వారంలో శని లేదా ఆదివారం తమకి తెలిపాలని కమిటీ తెలిపింది.

Advertisement
బెడ్‌రూమ్‌లో రాక్షసి ఉందనుకున్న చిన్నారి.. తీరా వెతికితే ఊహించని షాక్..?

తాజా వార్తలు