Sugarcane Cultivation : చెరుకు పంట సాగులో పోషక ఎరువుల యాజమాన్యం..!

చెరుకు పంటను( Sugarcane crop ) సాగు చేసే ముందు రైతులు సరైన యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించుకోవాలి.చెరుకు పంట సాగు విధానం పై అవగాహన ఉంటే పంటను సంరక్షించుకుని అధిక దిగుబడి పొందేందుకు వీలు ఉంటుందని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.

 Ownership Of Nutrient Fertilizers In Sugarcane Cultivation-TeluguStop.com

చెరుకు పంటలో అత్యంత కీలకం పోషక ఎరువుల యాజమాన్యం.వేసవికాలంలో నేలను లోతు దుక్కులు దున్ని, ఆఖరి దుక్కిలో ఒక ఎకరాకు 10 టన్నుల చివికిన పశువుల ఎరువును( Cattle manure ) వేసుకోవాలి.

చెరుకు నాటడానికి ముందు ఒక ఎకరాకు 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్( Super phosphate ) , 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను చెరుకు చాళ్లల్లో వేసుకోవాలి.చెరుకు నాటిన మూడు రోజుల లోపు నేలపై ఒక ఎకరానికి రెండు కిలోల అట్రాజిన్ ( Atrazine )కలిపిన రసాయనాన్ని పిచికారి చేయాలి.

చెరుకు నాటడానికి ముందు విత్తన దుంపలను 10 శాతం సున్నపు నీటిలో ఒక గంట పాటు ముంచాలి.ఇలా చేస్తే మొలక శాతం, పంటకు నీటి ఎద్దడిని తట్టుకునే శక్తి పెరుగుతుంది.చెరుకు సాళ్ల మధ్య కనీసం 80 cm దూరం ఉండేటట్లు చూసుకోవాలి.చెరుకు విత్తన దుంపలు నాటిన తర్వాత ఒక ఎకరానికి 1.2 టన్నుల చెరుకు చెత్తను నేలపై కప్పడం ద్వారా నేలలోని తేమను సంరక్షించవచ్చు.పైగా పొలంలో కలుపు ఉధృతితో పాటు పీక పురుగుల ఉధృతి కూడా తక్కువగా ఉంటుంది.

ఇక చెరుకు పంటకు తొలి విడత ఒక ఎకరానికి 30 కిలోల నత్రజని ఎరువు వేసుకోవాలి.దీర్ఘకాలిక బెట్ట పరిస్థితులలో 25 గ్రాముల యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.పొలంలో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి.ఇలా చేస్తే చీడపీడల పెడదా చాలా తక్కువగా ఉంటుంది.ఇక నేలలోని తేమ శాతాన్ని బట్టి పంటకు నీటి తడులు అందించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube