మొక్కజొన్న పంట( Corn crop )ను వర్షాధారంగా కూడా సాగు చేయవచ్చు.అందుకే వరి తరువాత తెలుగు రాష్ట్రాలలో అత్యధిక విస్తీర్ణంలో సాగు అవుతున్న పంట మొక్కజొన్న.
మిగతా పంటలతో పోలిస్తే మొక్కజొన్నలో కాస్త కూలీల ఖర్చు తక్కువ.కాకపోతే ఎరువుల యాజమాన్యంలో కొన్ని సూచనలు పాటిస్తేనే అధిక దిగుబడి సాధించడానికి అవసరం ఉంటుంది.
ఈ ఎరువులను సకాలంలో అందించాల్సి ఉంటుంది.మొక్కజొన్న పంట భూమి నుంచి అధికంగా పోషకాలను సంగ్రహించే పంట.పంట విత్తిన 30 రోజుల తర్వాత ఒక ఎకరాకు 50 కిలోల యూరియాను అందించి ఆ తర్వాత గొర్రుతో అంతర కృషి చేపట్టాల్సి ఉంటుంది.తరువాత పంట 55 రోజుల దశలో ఉన్నప్పుడు మరో 50 కిలోల యూరియాను 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ తో కలిపి వేయాలి.
వర్షాలు అనుకూలంగా లేని నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే ప్రాంతాలలో ఎరువులను పై పాటుగా అందించడం అంత శ్రేయస్కరం కాదు ఈ దశలో మొక్కల వేర్ల ద్వారా పోషకాలను సంగ్రహించలేని స్థితిలో మొక్కలు ఉంటాయి.కాబట్టి మొక్కలు కోలుకునేంతవరకు పోషకాలను ఆకుల ద్వారా అందించే ప్రయత్నం చేయాలి.

ఒక లీటరు నీటిలో 20 గ్రాముల యూరియా( Urea )ను కలిపి పిచికారి చేయాలి.ఆకుల ద్వారా నత్రజని పోషకం( Nitrogen ) మొక్కలకు అందుతుంది.అంతేకాకుండా 19:19:19 ను 10 గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేస్తే భాస్వరం లోపం లేకుండా నివారించవచ్చు.

మొక్కజొన్న పంట పూత, గింజ దశలో ఉన్నప్పుడు నీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.విత్తిన 30 రోజులకు, 35 రోజులకు పూత దశలో 15 రోజులకు, గింజ పాటు పోసుకునే దశలో నీటి తడులను తప్పకుండా అందించాలి.ఉదయం వేళల్లో మొక్కజొన్న మొక్కల ఆకులు చుట్టూ చుట్టుకున్నట్లు కనిపిస్తే నీటి ఆవశ్యకత ఉన్నట్లు గమనించి నీటి తడిని అందించాలి.







