ఎలుగుబంటి నుంచి తమ కుక్కని కాపాడిన యజమానులు.. వీడియో వైరల్..!

సాధారణంగా యజమానులను కుక్కలు అనునిత్యం కాపాడుతూ ఉంటాయి.అయితే ఇలాంటి కుక్కలకు ప్రాణహాని ఉందంటే యజమానులు కూడా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వాటిని కాపాడడానికి ముందుకు వస్తారు.

 Owners Who Saved Their Dog From A Bear Video Viral. Bear, Viral Latest, News Viral, Social Media, Video Viral, Dog, Saving,, Owner-TeluguStop.com

తాజాగా ఈ విషయం మరోసారి రుజువయ్యింది.వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక కుటుంబం తమ కుక్కను కాపాడేందుకు ఏకంగా ఎలుగుబంటితోనే తలపడ్డారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక ఇంటి ఆవరణలోకి యజమాని రావటం చూడవచ్చు.ఆమె ఫోన్ మాట్లాడుతూ ఉంది.

 Owners Who Saved Their Dog From A Bear Video Viral. Bear, Viral Latest, News Viral, Social Media, Video Viral, Dog, Saving,, Owner -ఎలుగుబంటి నుంచి తమ కుక్కని కాపాడిన యజమానులు.. వీడియో వైరల్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతలోనే ఆమె ఒక షాకింగ్ దృశ్యం చూసి గగ్గోలు పెట్టడం స్టార్ట్ చేసింది.ఆ దృశ్యం ఏంటంటే తన కుక్కని ఒక పెద్ద ఎలుగుబంటి వెంబడించింది.

అయితే తన కుక్కని ఎలుగుబంటి చంపేయబోతుందని ఆమె చాలా భయపడింది.ఎలుగుబంటి నుంచి తన కుక్కను కాపాడేందుకు మిగతా యజమానులు కూడా బయటికి వచ్చారు.

ఆ తర్వాత కుక్క ఎలాగోలా ఎలుగుబంటి నుంచి తప్పించుకొని ఇంటిలోకి దూరింది.అయితే ఎలుగుబంటి దానిని తరుముతూ ఇంట్లోకి రావాలని ప్రయత్నించింది.

ఇంతలోనే ఒక మగ వ్యక్తి ఇంటి ముందు నిల్చొని ఎలుగుబంటిని భయపెట్టి అక్కడినుంచి పంపించేశాడు.దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి.

ఆ వీడియోని వైరల్ హాగ్ అనే ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.ఒక కుటుంబం తమ కుక్కను ఎలుగుబంటి నుంచి కాపాడుతుంది.

అని వైరల్ హాగ్ ఒక క్యాప్షన్ జోడించింది.ఈ వీడియో కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఈ వీడియోకి ఇప్పటికే 75 వేలకు పైగా వ్యూస్, వేలల్లో లైకులు వచ్చాయి.ఈ వీడియోని మీరు కూడా వీక్షించండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube