ఓవర్‌ నైట్‌లో హీరో, విలన్‌ అయిన చైర్మన్‌ షరీఫ్‌

ప్రస్తుతం తెలుగు మీడియా మొత్తం కోడై కూస్తున్న పేరు షరీఫ్‌.ఏపీ మండలి చైర్మన్‌ అయిన షరీఫ్‌ పూర్తి పేరు మొహ్మద్‌ అహ్మద్‌ షరీఫ్‌.

ఈయన తెలుగు దేశం పార్టీ పుట్టినప్పటి నుండి అదే పార్టీలో కొనసాగుతూ వచ్చాడు.మృదు స్వభావి అవ్వడంతో పాటు వివాదాలకు దూరంగా ఉండటం వంటి కారణాల వల్ల ఈయన ఎక్కువ మందికి తెలిసే అవకాశం లేదు.

Over Night Hero Chairman Shareef Tdp Chandrababu Naidu-ఓవర్‌ నై�

తన పని తాను చేసుకుంటూ పోతూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే వ్యక్తి షరీఫ్‌.ఎమ్మెల్సీగా ఉన్న షరీఫ్‌ను చంద్రబాబు నాయుడు మండలి చైర్మన్‌ చేశాడు.

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన షరీఫ్‌ ప్రభుత్వంకు చుక్కలు చూపించాడు.జగన్‌ నాకేం ఎదురు అంటూ దూసుకు పోతున్న సమయంలో అనూహ్యంగా ఆయనకు బ్రేక్‌ వేశాడు.

Advertisement

మూడు రాజధానుల బిల్లును సెలక్షన్‌ కమిటీకి పంపడంతో తెలుగు దేశ పార్టీ నాయకులు అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇక షరీఫ్‌ కు అమరావతి ప్రాంత రైతులు మరియు అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని కోరుకునే వారు ఇప్పుడు పాలాభిషేకాలు చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో షరీఫ్‌ రియల్‌ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్స్‌ చేస్తున్నారు.ఎన్నిక ఒత్తిడులు వచ్చినా కూడా మీరు చేసిన ఈ పనితో రాష్ట్ర భవిష్యతు బాగుపడుతుందని అంటున్నారు.

మొత్తానికి ఓవర్‌ నైట్‌లో షరీఫ్‌ హీరో అయ్యాడు.కొందరికి మాత్రం విలన్‌ కూడా అయ్యాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు