తమిళనాడు రాష్ట్రంలో భారీ పేలుడు సంభవించింది.కడలుర్ రసాయనిక పరిశ్రమలో ఈ ఘటన చోటు చేసుకుంది.దాదాపు ఐదుగురు సిబ్బంది మరణించినట్లు సమాచారం.15 మంది కార్మికులకు తీవ్రంగా గాయాలు కావడంతో .క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది.ఫ్యాక్టరీ లోని బాయిలర్ పేలడంతో.
ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు కాగా ఇద్దరు పురుషులు అన్నట్టు సమాచారం.
క్షతగాత్రులను కడలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది.
ఇదే క్రమంలో ఫైరింజన్లు రంగంలోకి దిగి… పరిశ్రమలో చెలరేగిన మంటలను ఆర్పుతున్నయి.పేలుడు ధాటికి సౌండ్ గట్టిగా రావటం తో పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు.
క్షణాలలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఐదుగురు మరణించటంతో.గాయపడిన క్షతగాత్రులను రక్షించడానికి రక్షణ సిబ్బంది తో పాటు స్థానికులు కూడా రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
ఇదిలా ఉంటే పరిశ్రమలకు ఎటువంటి అనుమతులు లేవు అని స్థానికంగా ఉన్న వాళ్ళు చెబుతున్నారు.దీంతో జరిగిన ఘటనపై ప్రభుత్వం దర్యాప్తుకు అధికారులను నియమించడం జరిగింది.