అమెరికాలో మన భారతీయుడే ప్రస్తుతం హాట్ టాపిక్...

అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయుల హవా ఎక్కువగానే ఉంటుంది.భారత్ లోని వివిధ రాష్ట్రాల నుంచీ అమెరికాకు వలస వెళ్ళిన భారతీయలు అక్కడ ఉద్యోగ, వ్యాపార రంగంలో స్థిరపడ్డారు.

 Our Indian Is Currently A Hot Topic In America , Indian Nri, Jaswinder Singh, P-TeluguStop.com

అయితే ఏ దేశం వెళ్ళినా సరే భారత్ లో నేర్చుకున్న సహాయ గుణం, కష్టాలలో ఉన్న వారికి అండగా నిలబడాలన్న పాటాలు మాత్రం మర్చిపోలేదు.భారత్ లోని వివిధ ప్రాంతాల నుంచీ వెళ్ళిన భారతీయులు అక్కడ పలు స్వచ్చంద సంస్థలను ఏర్పాటు చేసుకుని తమకు తోచిన సాయం అందిస్తున్నారు.

కష్టాలలో ఉన్నవారికి తోడుగా ఉంటూ భారతీయతను చాటుతున్నారు.ఈ క్రమంలోనే అగ్ర రాజ్యం అమెరికాలోని ఓ భారతీయ ఎన్నారై తాను చేస్తున్న సేవలతో హాట్ టాపిక్ అవుతున్నాడు.

జస్విందర్ సింగ్ భారత్ లోని పంజాబ్ కి చెందిన ఆయన ఎన్నో ఏళ్ళ క్రితమే అమెరికాలో వ్యాపారం చేసుకుంటూ స్థిరపడిపోయారు.అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో ఫీనిక్స్ వ్యపారం చేసుకుంటూ పెట్రోల్ బంక్ నడుపుతున్న జస్విందర్ సింగ్ అమెరికాలో ప్రస్తుత ఆర్ధిక పరిస్థితుల నేపధ్యంలో పేదలు, మధ్య తరగతి వారు పడుతున్న ఇబ్బందులకు చెలించిపోయాడు.

వారికి తనవైపు నుంచీ ఎంతో కొంత సాయం అందించాలని భావించాడు ఈ క్రమంలోనే తన పెట్రోల్ బంక్ లో తక్కువ ధరకే పెట్రోల్ పోసేందుకు సిద్దమయ్యాడు.

అమెరికాలో ధరల పెరుగుదల ప్రస్తుతం అక్కడ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

తనకు నష్టం కలిగినా పరవాలేదు కానీ అధిక ధరలకు పెట్రోల్ అమ్మ కూడదని భావించాడు.గత ధరకంటే తక్కువ ధరకే ప్రస్తుతం పెట్రోల్ అమ్ముతున్నాడు.

ఈ విషయం వైరల్ అవడంతో జస్విందర్ సింగ్ చేస్తున్న సాయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.దాంతో ప్రపంచ వ్యాప్తంగా జస్విందర్ ను పొగడ్తలలతో ముంచెత్తుతున్నారు.

కాగా తక్కువ ధరకే అమ్మడం వలన మీకు నష్టం వస్తుంది కదా అని మీడియా అడుగగా నేను కష్టంలో ఉన్నప్పుడు దేవుడు సాయం చేశాడు.ఇప్పుడు వీళ్ళు కష్టాలలో ఉన్నారు నేను సాయం చేయలని అనుకున్నాను అని సింపుల్ గా సమాధానం చెప్తున్నాడు.

ఇదిలాఉంటే తక్కువ ధరకు అమ్మడం వలన వచ్చే నష్టాన్ని జస్విందర్ సింగ్ ఆయన సతీమణి కలిసి అధిక సమయం కేటాయించి పనిచేయడం ద్వారా భర్తీ చేసుకుంటున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube