వరంగల్ మట్టి కోట చుట్టూ ఉన్న అగర్తల చెరువు మాయం, సహకరిస్తున్న రెవెన్యూ అధికారులు, చోద్యం చూస్తున్న కేంద్రపురావస్తుశాఖ.
వరంగల్ నగరంలో ఉన్న కాకతీయుల కాలం నాటి కట్టడాలు రాతికోట మట్టి కోటాలు చెరువులు కాకతీయుల కాలం నాటి కళ సంపదను భవిష్యత్ తరాలకు మనం అందించే స్థితి లేదు, ఆనాటి సంపదను వ్యక్తిగత స్వార్థం కోసం సొంత లాభం కోసం చారిత్రక కట్టడాలు చెరువులు కోటలు రోజురోజుకు కనుమరుగవుతుంది.
ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో చిక్కుకొని చెరువులు సైతం ప్లాట్లుగా మారుతున్న వైనం.మన పక్కనే ఉన్న మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ కు కూత పెట్టు దూరంలో 41 వ డివిజన్ విశ్వనాధ్ కాలనీ ని అనుకొని అగర్తల చెరువును భారీ స్థాయిలో మట్టిపోసి పూడ్చుతుంటే నిమ్మకు నీరెత్తనట్టు ప్రభుత్వ అధికారులు పురావస్తు శాఖ సిబ్బంది వ్యవహరిస్తోంది వాస్తవంగా ఖిలా వరంగల్ మట్టి కోట చుట్టూ దాని పరిధి 9 కిలోమీటర్లు అదే మాదిరిగా లోపట రాతికోట 4 5 కి మీ ఈ ప్రాంతం అంతా కేంద్ర పురవస్తు శాఖ పరిధిలోకి వస్తుంది టూరిస్టులకు కేంద్రంగా కాకతీయుల నాటి కట్టడాలకు ప్రత్యేక గుర్తింపు కలదు ఖిల్లావరంగల్ మట్టి కోట చుట్టూ 100 మీటర్లు వరకు నిషేధిత ప్రాంతంగా దాని తర్వాత చెరువు అగర్తల్ శిఖం భూములు ఉన్నాయి.
వాటిని దళితులకు ఇనాం ఇచ్చారు వ్యవసాయ నిమిత్తం కానీ శిఖం పరిధి దాటి నిషేధిత పరిధి లోకి చొరబడి ఉన్న చేరువుని స్వాహా చేస్తున్నారు కోట రక్షణా కోసం ఏర్పడిన చెరువు ప్రవేట్ వ్యక్తులకు పట్టాలు ఉన్నాయట ఎవరిచ్చారు ఏలవచ్చాయి సుమారు 300 మీటర్లు పరిసర ప్రాంతంగా పురావస్తు శాఖ పరిధి ఈ నిబంధన ప్రకారం కోట చుట్టూ చెరువు రక్షణ నిమిత్తం ఏర్పర్చుకున్న రక్షణ వలయం లాంటి చెరువులో మోసళ్ళు విష సర్పాలు నీటిలో ఉండే ప్రమాదకరమైన జీవసంపద ఉండేది ఈ చరిత్రనంత మాయం చేస్తున్నారు కోట చుట్టు ఉన్న చెరువును లేకుండా చేస్తున్నారు ప్లాట్లు చేస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో చేస్తున్న కబ్జా ఫలితంగా ఈ చెరువు మాయమైంది 1800 ఎకరాలు ఉండవలసిన చెరువు ప్రస్తుతం 100 ఎకరాలు కూడా లేదంటే దీని వెనకాల ఎంత పెద్ద భూకుంభకోణం దగివుందో మనం అర్థం చేసుకోవచ్చు! మట్టి కోట మీద సర్కార్ తుమ్మ పిచ్చి చెట్లు మొలిచ్చి ఉంటే దానిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి లేదంటే ఎంత బాధ్యత గల ప్రభుత్వలు ఉన్నాయో దీన్నిబట్టి మనకు అర్థమవుతుంది కావున చెరువును కాపాడుకుందాం ప్రభుత్వం కోటచుట్టు నిషేధిత సరిహద్దులు ఏర్పాటు చేసి ఈ కళ సంపదను కాపాడాలని ఎం సాగర్ డిమాండ్ చేశారు.
ఈ సందర్బంగా సీపీఎం బృందం కబ్జా అయిన అగర్తల్ చెరువును సీపీఎం నాయకులు డి సాంబమూర్తి జి ఓదేలు సిహెచ్ మరయ్య ఎ ఉదయ్ ఎస్ ఆనంద్ బి రాధికా తటిపముల ఉషశ్రీ కేడల ప్రసాద్ జ్యోతిరావు పూలే సామాజికవేత్త అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.