ఒక ఫార్ములా ఒక ఇండస్ట్రీలో పని చేస్తే మరో ఇండస్ట్రీలో పని చేయదు.ఒక ఇండస్ట్రీలో ఒక సినిమా సూపర్ హిట్ అయితే అదే సినిమా వేరే ఇండస్ట్రీలో అట్టర్ ప్లాప్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
ఇక ఇప్పుడు తాజాగా మరోసారి ఒకే ఫార్ములాతో వచ్చిన రెండు సినిమాల్లో ఒకటి హిట్ అవ్వగా మరొక ప్లాప్ అయ్యింది.ఈ దీపావళికి మన దగ్గర వచ్చిన ఓరి దేవుడా సినిమా రిలీజ్ అయినా విషయం తెలిసిందే.
తమిళ్ హిట్ సినిమా ఓ మై కడవులే కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో కూడా హిట్ అయ్యింది.మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో కీలక పాత్రలో విక్టరీ వెంకటేష్ కూడా నటించాడు.
వెంకీ ఈ సినిమాలో దేవుడి పాత్రలో నటించారు.శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సమర్పణలో పివిపి బ్యానర్ పై తెరకెక్కిన ఓరి దేవుడా సినిమా తెలుగులో కూడా అదే స్థాయిలో హిట్ అయ్యింది.
దీపావళి కానుకగా వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.ముఖ్యంగా వెంకటేష్ పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టు కోవడంతో ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఇదే ఫార్ములాతో బాలీవుడ్ లో థాంక్ గాడ్ తెరకెక్కింది.దేవుడు మనిషి కథాంశంతో సాగే కథతోనే ఇది తెరకెక్కింది.అజయ్ దేవగన్, సిద్ధార్థ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించారు.ఇంద్రకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓరి దేవుడా సినిమాకు దగ్గర పోలికగా సాగింది.అయితే దర్శకుడు తీర్చిదిద్దిన విధానం డిఫెరెంట్ గా ఉండడంతో ఇక్కడ హిట్ అయినా ఫార్ములా బాలీవుడ్ లో ఫట్ అయ్యింది.ఒక్క సీన్ కూడా న్యాచురల్ గా లేకపోవడంతో ఈ సినిమా విఫలం అయ్యింది.







