హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట విపక్ష పార్టీలకు చెందిన కార్పొరేటర్లు నిరసనకు దిగారు.రెండవ దశ ఎస్ఆర్డీపీ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.
శానిటేషన్ కార్మికుల దుస్తులు ధరించిన బీజేపీ కార్పొరేటర్లు చెత్తను ఊడుస్తూ నిరసన వ్యక్తం చేశారు.మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలని అదేవిధంగా జీహెచ్ఎంసీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులకు బీజేపీ కార్పొరేటర్లు మద్ధతు ప్రకటించారు.దీంతో జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.







