ఆపరేష్ నంది బాబు పై ఐవైఆర్ సంచలన కామెంట్స్

ఏపీ ప్రభుత్వ సీఎస్ గా పని చేసి ఆపై చంద్రబాబు కోరికపై బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మెన్ గా భాద్యతలని స్వీకరించి చంద్రబాబు కి అత్యంత సన్నిహిత వ్యక్తిగా పేరు ఉన్న ఐవైఆర్ కృష్ణారావు…తరువాతి కాలంలో చంద్రబాబు ని విభేదించిన విషయం అందరికీ తెలిసిందే.అప్పటి నుంచీ ఇప్పటి వరకూ చంద్రబాబు పై లెక్కలేనన్ని ఆరోపణలు.

 Operation Nadi Ivr Fire On Chandrababu-TeluguStop.com

ఎన్నో నిందలు వేస్తూ చంద్రబాబు ప్రతిష్టని ఎదో రకంగా దెబ్బ తీయాలని చూస్తున్న ఐవైఆర్ ప్రతీ రోజు ఎదో ఒక వింత కొటేషన్స్ పెడుతూ చంద్రబాబు పై ఆరోపణలు గుప్పిస్తునే ఉన్నారు ఈ తరుణంలో మళ్ళీ ఐవైఆర్ వింత వ్యాఖ్యలతో మీడియా ముందుకు వచ్చారు.ఆపరేషన్ నంది అంటూ ఐవైఆర్ చేసిన విమర్శలు విమర్సకులని సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.

40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న ఏపీ సీఎం చంద్రబాబు కి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎపీకి వాటి వల్ల కలిగే లాభాలు ఏంటి అనేది తెలియకుండా ఉంటుందా.? అవన్నీ తెలియకుండానే ఎన్నేళ్ళు రాజకీయాలలో ఉండగలరా జాతీయ స్థాయిలో చక్రం తిప్పగాలరా.? కానీ ఐవైఆర్ మాత్రం చంద్రబాబు పై బురద చల్లడానికి పూటకో మాట మాటకో వేషం వేస్తూ వైసీపి వాయిస్ వినిపిస్తున్నారు.బాబు పై విమర్శలు గుప్పిస్తున్నారు.

చంద్రబాబు ప్రభుత్వంలోని టీడీపీ నేతలు విపరీతమైన అవినీతికి పాల్పడ్డారని తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు.అయితే తాజాగా ఐవైఆర్ చంద్రబాబు పై చేసిన ఆరోపణలు చాలా వింతగా ఉన్నాయి.

“ఆపరేషన్ నంది” పేరుతో చంద్రబాబు బురద జల్లుడు కార్యక్రమం చేపట్టారని ఐవైఆర్ చంద్రబాబు పై విమర్శలు చేశారు.చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆ అవినీతి బట్టబయలైనప్పుడు.

దానిని జాతీయస్థాయి కుట్రని చంద్రబాబు కొట్టిపారేస్తారని ఎద్దేవా చేశారు…ప్రస్తుతం పార్టీల అధినేతలు దిగజారి వ్యవహరిస్తున్నారని భవిష్యత్తులో తమపై వచ్చే ఆరోపణలను అంతర్జాతీయ కుట్రలుగా అభివర్ణించి సీఐఏ హస్తముందని చెప్పినా ఆశ్చర్యపోనవరసం లేదని చంద్రబాబునుద్దేశించి ఎద్దేవా చేశారు.

అయితే ఏపీ ప్రభుత్వం అవినీతిని ప్రశ్నించే వారిని హింసలు పెట్టి మరీ వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తారని చంద్రబాబు కి ఇది కొత్త కాదని కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బాబు కొత్తగా ఒక టీం ఏర్పాటు చేసుకుని ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఈ టీం వారిపై కుట్రలు పన్నుతుందని ఇదే “ఆపరేషన్ నంది” అని ఆరోపించారు…త్వరలో ఈ ఆపరేషన్ కార్యక్రమాన్ని మరింతగా విస్తృతం చేస్తున్నారని అందరూ అప్రమత్తంగా ఉండాలని ఐవైఆర్ హెచ్చరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube