అయోధ్యలో రామ మందిరం ఓపెనింగ్ 2024లో జరగనుంది.2024, జనవరి 1వ తేదీన రామ మందిరాన్ని ఆవిష్కరించనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.మకర సంక్రాంతి పర్వదినాన ఆలయం గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహాలను ప్రతిష్ఠించిన తర్వాత ఆలయానికి భక్తులను అనుమతించనున్నట్లు సమాచారం.కాగా అయోధ్యలో రామ జన్మభూమి వద్ద నూతనంగా రామ మందిరాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
బాబ్రీ మసీదును కూల్చి వేసిన స్థలం వద్ద కొత్త ఆలయాన్ని నిర్మిస్తున్నారు.ప్రస్తుతం రామ్ లల్లా దర్శనం కొత్తగా నిర్మిస్తున్న ఆలయ పరిసర ప్రాంతంలోనే జరుగుతోంది.ఈ క్రమంలోనే అయోధ్య రామ మందిరం నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.2020 ఆగస్ట్ 5న ప్రధాని నరేంద్ర మోదీ రామ మందిరం నిర్మాణానికి భూమి పూజ చేసిన విషయం తెలిసిందే.