I phones Tata Electronics : ఐ-ఫోన్ల తయారీ కోసం కేవలం మహిళలని తీసుకుంటున్నారు... 45 వేల ఖాళీలు వీరికోసమే!

అవును, మీరు విన్నది నిజమే.మహిళామణులారా! మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న అవకాశం రానేవచ్చింది.

వెంటనే త్వరపడండి, ఆలోచించినా ఆశాభంగం.ఐ-ఫోన్‌ అనేది బ్రాండ్ కా బాప్ వంటిది.

దీనిని ఇష్టపడని ప్రజానీకం ఉండదనే చెప్పుకోవాలి.ఇకపోతే చైనాలో కరోనా మహమ్మారి తర్వాత అక్కడ మాన్యుఫాక్చరింగ్‌ చేపట్టిన పలు అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్థలు ఇపుడు ప్రత్యామ్నాయ మార్గాలవైపు చూస్తున్నాయి.

అందులో భాగంగా భారత్‌లో ఐ-ఫోన్ల తయారీకి ఆపిల్‌ రంగం సిద్ధం చేసుకుంది.అవును, కాగా ఇక్కడ ఐ-ఫోన్ల తయారీలో మన దేశీయ టాటా గ్రూప్‌ కూడా భాగస్వామి కాబోతుండటం విశేషం.

Advertisement

దీని కోసం వచ్చే రెండు సంవత్సరాలలో ప్రత్యేకంగా 45 వేల మంది మహిళా ఉద్యోగులను నియమించుకునేందుకు టాటా గ్రూప్‌ సిద్ధమైంది.కాగా తమిళనాడులోని హోసూర్‌లో గల టాటా టెక్నాలజీ ఫ్యాక్టరీలో ఇప్పటికే 10000 మంది ఉద్యోగులను నియమించుకోగా వారిలో అత్యధికులు మహిళలు కావడం గమనార్హం.

గత సెప్టెంబర్‌లో సుమారు 5 వేల మంది మహిళలను నియమించుకున్నదని బ్లూంబర్గ్‌ వార్తా కథనం.

కాగా హొసూర్‌ప్లాంట్‌లో పని చేస్తున్న ఈ మహిళా వర్కర్లు స్థూల వేతనం రూ.16వేలకు పైగా ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం. కాగా ఇది ఇండస్ట్రీ యావరేజీ వేతనం కంటే 40% ఎక్కువ అని తెలుస్తోంది.

ఫ్యాక్టరీ ఆవరణలోనే వర్కర్లకు ఫుడ్‌, నివాస వసతి కల్పించింది టాటా ఎలక్ట్రానిక్స్‌. దీంతోపాటు వర్కర్లకు ట్రైనింగ్‌, ఎడ్యుకేషన్‌ కూడా అందించనుంది.ఇకపోతే ఫోన్ల తయారీకి విస్ట్రోన్‌ కంపెనీతో టాటా కంపెనీ చర్చలు జరుపుతోంది.

వింటర్ లో జుట్టు అధికంగా రాలిపోతుందా.. జామ ఆకులతో పరిష్కరించుకోండిలా!

ఐఫోన్ల తయారీతో టాటా టెక్నాలజీ కూడా మాన్యుఫాక్చరింగ్‌ రంగంలోకి వచ్చేసినట్లే.ఇక విస్ట్రోన్‌తో టాటా గ్రూప్‌ ఒప్పందం గాని ఓకే అయితే, భారత్‌లో ఐఫోన్‌ తయారు చేయనున్న దేశీయ తొలి కంపెనీగా టాటా విరాజిల్లనుంది.

Advertisement