Tollywood Star Heroes: రూటు మార్చేసిన స్టార్ హీరోలు.. ఇక్కడ అయిన సక్సెస్ అవుతారా?

ఎప్పుడైతే కరోనా వ్యాపించి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిందో అప్పటినుంచి ప్రతి ఒక్క రంగాలలో మార్పులు చెందాయి.ముఖ్యంగా సినీ రంగంలో మాత్రం తీరని నష్టాలు ఎదురయ్యాయి.

 Tollywood Star Heroes More Interested On Digital Platforms Web Series Venkatesh-TeluguStop.com

చాలా వరకు చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు సైతం వాయిదా పడ్డాయి.దానివల్ల నిర్మాతలకు మాత్రం బాగా నష్టాలు వచ్చాయి.

అయితే వైరస్ ప్రభావం తగ్గినాక థియేటర్ లలో సినిమాలు విడుదలైనప్పటికీ చాలావరకు థియేటర్లలో సినిమాలు చూడటానికి ప్రేక్షకులు కూడా ఇష్టపడలేదు.

పైగా అంతలోనే ఆ సమయంలో ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రభావం ఎదురయింది.

దీంతో చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు కూడా అందులోని విడుదలకు నోచుకున్నాయి.ప్రేక్షకులు కూడా ఈ వేదికకు బాగా అలవాటు పడ్డారు.

థియేటర్ల దగ్గరికి వెళ్లి చూడటం కంటే ఇదే బెటర్ అనుకొని అక్కడ వచ్చే సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు.

దీంతో థియేటర్లలో పెద్ద హీరోల సినిమాలు చూడటానికి మాత్రమే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు.

ఇక చిన్న చిన్న సినిమాలు అన్ని ఓటీటీ వేదికగా చూస్తున్నారు.దీంతో చిన్న సినిమాలు థియేటర్ లలో విడుదలైన ఎటువంటి లాభం లేకుండా పోతుంది.

అందుకే చిన్న హీరోల సినిమాలు ఓటీటీ లో రావడానికి సిద్ధంగా ఉన్నాయి.నేరుగా ఓటిటిలో విడుదల చేసుకొని మంచి లాభాలను అందుకుంటున్నాయి.

Telugu Chaitu, Platms, Adi Saikumar, Srikanth, Nagarjuna, Raj Tarun, Rana, Heroe

కేవలం చిన్న హీరోల సినిమాలే కాకుండా స్టార్ హీరోల సినిమాలు కూడా ఓటీటీ లో డైరెక్ట్ గా విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.ఇక ఇప్పటికే కొందరు హీరోలు థియేటర్లో విడుదల చేయటం కంటే ఓటీటీ లో విడుదల చేయాలి అని రూటు మార్చారు.థియేటర్ వేదికగా సక్సెస్ కాకపోవటంతో ఓటీటీ లో తమ సక్సెస్ ను పరీక్షించుకుంటున్నారు.ముఖ్యంగా సినిమాల కంటే వెబ్ సిరీస్ లకి మాత్రం బాగా అలవాటు పడుతున్నారు.

ఇప్పటికే కొంతమంది స్టార్ నటులు వెబ్ సిరీస్ లలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇక ప్రస్తుతం.

హీరో రాజ్ తరుణ్ కూడా ఓటీటీలోకి అడుగు పెట్టాడు.ప్రస్తుతం ఆయన ఆహనా పెళ్ళంట అని వెబ్ సిరీస్ చేస్తున్నాడు.

అక్కడ మంచి సక్సెస్ అందుకోకపోవటంతో ఇక్కడ మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు.ఇక మరో హీరో ఆది సాయికుమార్ కు కూడా అంతగా కలిసి రావట్లేదు.

దీంతో ఈయన కూడా ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

Telugu Chaitu, Platms, Adi Saikumar, Srikanth, Nagarjuna, Raj Tarun, Rana, Heroe

ప్రస్తుతం ఆయన కూడా ఒక వెబ్ సిరీస్ లో చేస్తున్నాడు.ఇక సుశాంత్ ఓటీటీ లోకి వచ్చాక కూడా ఇక్కడ కూడా అంటే సక్సెస్ కాలేకపోయాడు.మరో హీరో నవీన్ చంద్ర కూడా అదృష్టాన్ని ఓటీటీలో పరీక్షించుకుంటున్నాడు.

హీరో శ్రీకాంత్ కూడా వచ్చిన అవకాశాలను వదులుకోకుండా సైన్ చేస్తూ దూసుకెళ్తున్నాడు.

వీళ్లే కాకుండా స్టార్ హీరోలు రానా, వెంకటేష్ కలిసి ఓ వెబ్ సిరీస్ చేయనున్నట్లు తెలిసింది.

నాగచైతన్య కూడా ఒక వెబ్ సిరీస్ లో చేస్తున్నాడు.నాగార్జున కూడా త్వరలో ఈ వేదికపై అడుగుపెట్టనున్నట్లు తెలుస్తుంది.

మొత్తానికి ఓటీటీ ప్రభావం బాగా పెరగటంతో చిన్న హీరోలు సక్సెస్ కోసం పెద్ద హీరోలు కొత్తదనం కోసం అడుగుపెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube