విశాఖ రుషికొండ తవ్వకాలపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.రుషికొండపై సర్వే చేయాలని సర్వే బృందానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
తవ్వకాలపై సర్వే చేపట్టాలని కేంద్ర పర్యావరణ అటవీశాఖ బృందాలకు ఆదేశాలు జారీ చేసింది.అనుమతికి మించి ఎంతమేర భవనాలు నిర్మిస్తున్నారో తెలుసుకోవాలని చెప్పింది.
అనంతరం నివేదికను హైకోర్టుకు సమర్పించాలని సర్వే బృందానికి తెలిపింది.అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది.







