నేటి దైనందిత జీవితంలో వాహనదారులకు బైక్ పార్కింగ్ చేయడం అనేది చాలా పెద్ద సమస్యగా మారింది.ఇంట్లో సరిపడ స్థలం లేకపోవడం వలన కావచ్చు, బయటకి వెళ్ళినపుడు వచ్చే పార్కింగ్ సమస్య కావచ్చు… బైక్ భద్రత అనేది చాలాచోట్ల నేడు ప్రశ్నార్థకంగా మారింది.
కొంతమంది కేటుగాళ్లకు బైక్స్ దొంగతనం అనేది వెన్నతో పెట్టిన విద్యగా మారింది.అపార్ట్మెంట్స్ కింద సెల్లార్లో పెట్టిన బైక్స్ కి కూడా గ్యారంటీ లేదు.
ఇలాంటి తరుణంలో కార్ల మాదిరిగానే బైక్‌లకు అలారం సిస్టం ఉంటే ఎలా ఉంటుంది? అనే ఐడియా వచ్చిందో ఏమోమరి!.
సరిగ్గా ఇలాంటి ఐడియాను ఇంప్లీమెంట్ చేసి ఒక మంచి ప్రొడక్ట్ మార్కెట్లోకి ప్రవేశపెట్టారు సదరు కంపెనీ యాజమాన్యం.
అదొక యాంటీ థెఫ్ట్ అలారమ్ సిస్టమ్.దీని ద్వారా మీ బైక్ ని దొంగల బారినుండి సురక్షితంగా కాపాడుకోవచ్చు.
ఈ అలారం సెక్యూరిటీ గ్యాడ్జెట్ బైక్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.ఈ గ్యాడ్జెట్ కొన్నవారికి అలారం సిస్టమ్, బజర్, రిమోట్ లభిస్తాయి.
దీనిని బైక్ సీటును ఓపెన్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.యూట్యూబ్‌లో వీడియోలు చూసి కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.

ఇలా అలా ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత బైక్‌ను రిమోట్ కంట్రోలర్ తో ఆపరేట్ చేసుకోవచ్చు.రిమోట్‌పై స్టార్ట్ బటన్‌ను రెండు సార్లు క్లిక్ చేస్తే బైక్ కీ అవసరం లేకుండానే స్టార్ట్ అవుతుంది.అలాగే బైక్‌ను లాక్ చేస్తే ఎవరైనా బైక్‌పై చేయి వేసినా పెద్దగా అలారం వస్తుంది.కాగా దీని బజర్ ఏకంగా 100 డీబీతో మోగుతుందని సమాచారమా.అంటే దాని సౌండ్ చాలా దూరం వరకు స్పష్టంగా వినిపిస్తుంది.మరలా రిమోట్‌తో మళ్లీ ఆఫ్ చేసే వరకు అది మోగుతూనే ఉంటుంది.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్స్‌లో ఈ యాంటీ థెఫ్ట్ అలారంలు అందుబాటులో ఉన్నాయి.కాగా వాటి ధర కంపెనీ బట్టి రూ.1000 నుంచి రూ.1500లోపే ఉంటుంది.







