అరచేతితోనే ఆన్‌లైన్ పేమెంట్స్ చేయవచ్చు.. అమెజాన్ నుంచి మంచి ఫీచర్

ప్రముఖ ఈ-కామర్స్, టెక్నాలజీ కంపెనీ అమెజాన్( Amazon ) ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రొడక్ట్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటుంది.అనేక ఎలక్ట్రానిక్ పరికరాలను మార్కెట్‌లోకి విడుదల చేస్తూ ఉంటుంది.

 Online Payments Can Be Done With The Palm Of Your Hand.. A Good Feature From Ama-TeluguStop.com

ఇప్పటికే బ్లూటూత్, సౌండ్ స్పీకర్, అలెక్సా లాంటి అనే ప్రోడక్ట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయగా.వాటికి మంచి డిమాండ్ ఏర్పడింది.

అయితే ఇప్పుడు మరో కొత్త టెక్నాలజీతో అమెజాన్ మార్కెట్‌లోకి వస్తోంది.అమెజాన్ వన్ అడ్వాన్స్‌డ్ పామ్ స్కానింగ్ పేమెంట్ సిస్టమ్‌ను తీసుకొచ్చింది.

అమెజాన్ వన్ పేమెంట్ సిస్టమ్( Amazon One payment system ) ద్వారా మీ అరచేతి ద్వారానే సులువుగా పేమెంట్స్ చేసుకోవచ్చు.ఇందుకోసం తమ అరచేతిని రీడర్ డివైజ్ పై ఊపితే సరిపోతుంది.2020లో ఈ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకురాగా.ఇప్పుడిప్పుడు అన్ని దేశాలకు విస్తరిస్తోంది.

ఇప్పుడు అమెరికాలోని 500 హోల్ ఫుడ్స్ మార్కెట్ స్టోర్లకు వీటిని విస్తరించాలని చూస్తోంది.తొలి దశలో అమెజాన్ రిటైల్, ఎంటర్‌టైన్‌మెంట్ వెన్యూస్, అమెజాన్ గో స్టోర్స్, స్పోర్ట్స్ స్టేడియాలు, ఎయిర్‌పోర్టులలో మాత్రమే ఈ టెక్నాలజీ ప్రారంభించింది.

అమెజాన్ వన్( Amazon One ) యూజర్ల సంఖ్య ఇప్పుడు 3 మిలియన్లకు చేరుకుంది.అమెజాన్ వన్ ఫీచర్‌ను వినియోగించాలంటే మొదట అమెజాన్ అకౌంట్, మొబైల్ నెంబర్, పేమెంట్ కార్డ్ కలిగి ఉండాలి.ఆ తర్వాత వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రీ ఎన్ రోల్ చేసుకోవాలి.ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత తమ అరచేతిని ఎక్కడైనా షాపింగ్ మాల్స్ లలో రీడర్ పై పెట్టి పేమెంట్ చేయవచ్చు.

దీని వల్ల ట్రాన్సక్షన్ కూడా సురక్షితంగా ఉంటుందని, ఎలాంటి ఇబ్బంది ఉండదని అమెజాన్ చెబుతోంది.మార్కెటింగ్ ప్రయోజనాల కోసం అమెజాన్ వన్ పామ్ డేటా వాడమని, ఇతర కంపెనీలకు కూడా విక్రయించబోమని అమెజాన్ చెబుతోంది.

డేటా దుర్వినియోగం అవ్వడం అసాధ్యమని అమెజాన్ వర్గాలు చెబుతున్నాయి.దీంతో దీనికి యూజర్ల సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతోంది.

Amazon One palm payment technology

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube