సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో మనుషుల్ని దోచుకుంటున్నారు.సైబర్ క్రైమ్స్ పైన పోలీసులు నిఘా పెరిగిన కొద్దీ వారి అరాచకాలు ఎక్కువైపోతున్నాయి.
దానికోసం వారు కొత్త కొత్త దార్లు వెతుక్కుంటున్నారు.మీకు ఎపుడైనా ఇలాంటి అనుభవం జరిగిందా? మీరు ఏ ఆర్డర్ పెట్టకుండానే మీకు ఆర్డర్ వచ్చిందంటూ డెలివరీ బాయ్ ఎపుడైనా మీ ఇంటికొచ్చాడా? గబాబాగా మీ ఫోన్ నెంబర్ అడిగేసి ఓటీపీ చెప్పమని మిమ్మల్ని అడిగాడా? అది సరే.మీరు అతనితో ఏం బుక్ చేయకుండా ఆర్డర్ ఇంటికి రావడం ఏమిటి? అని అడిగితే, ఏదో పొరపాటున వచ్చింది అని చెప్పి ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవడానికి మొబైల్‌కు వచ్చే ఓటీపీ చెప్పండి చాలు అని ఎవరైనా అడిగారా?
అయితే మీరు ఇక్కడ ట్రాప్ లో పడ్డట్టే అని అర్ధం చేసుకోండి.మిమ్మల్ని అలా నమ్మబలికేలా ప్రయత్నం చేసి, మీరు ఓటీపీ చెప్పగానే మీ బ్యాంక్ అకౌంట్ మొత్తం లూటీ చేసేస్తారు జాగ్రత్త! అవును, మీరు విన్నది నిజం.ఇపుడు సైబర్ కేటుగాళ్లు ఈ రకమైన ఎత్తుగడలతో వస్తున్నారు.ఈ విషయమై ఏపీ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.ఇప్పటికే ఓఎల్‌ఎక్స్‌లో వస్తువుల అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన మోసాలను మనం తరచూ మనం చూస్తూనే ఉంటాం.ఆ కోవలోనే ఇటీవల మీషో, క్వికర్ వినియోగదారులను సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేసారని చెప్పారు సైబర్ క్రైమ్ పోలీసులు.
ఇకవేళ, మీకు ఇలాంటి అనుభవాలు జరిగింటే జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.సాధారణంగా ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇవ్వకుండా పొరపాటున కూడా మనకు ఎలాంటి ఆర్డర్స్ ఇంటికి రావని అర్ధం చేసుకోవాలి.ఇలా ఎవరన్నా ఆర్డర్ క్యాన్సిలేషన్ పేరిట ఓటీపీ చెప్పమని అడిగితే అస్సలు చెప్పొద్దని అంటున్నారు.ఒకవేళ మోసం జరుగుతున్నట్లు అనుమానమొస్తే.వెంటనే సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు.ఒకవేళ పొరపాటున ఎవరైనా సైబర్ నేరానికి గురైతే.9121211100 వాట్సాప్ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏపీ సైబర్ క్రైమ్ ఎస్పీ అమిత్ బర్దర్ పేర్కొన్నారు.