ఇకనుండి ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్‌ టీడీఎస్ చెల్లించాల్సిందే... ఎప్పటినుండంటే?

Online Gaming Apps Have To Pay TDS From Now On Since When Online Games, Technology News, Latest News, Technology Updates, Tds, Paying, April 1st

భారతదేశంలో ఆన్‌లైన్ గేమింగ్( Online games ) మంచి ఫామ్ లో వుంది.రోజురోజుకీ ఇక్కడ గేమింగ్ కి మంచి మార్కెట్ ఉండడంతో ఈ బిజినెస్ ద్వారా చాలామంది వ్యక్తులు అధిక ఆదాయం ఆర్జిస్తున్నారు.

 Online Gaming Apps Have To Pay Tds From Now On Since When Online Games, Technol-TeluguStop.com

ఇక గేమింగ్ కంపెనీల గురించి అయితే చెప్పేదేముంది? గేమర్ల నుంచి కమీషన్ లేదా ఫీజు తీసుకుంటూ దండిగా ప్రాఫిట్స్ సంపాదించుకుంటూ పోతున్నాయి.ఈ తరుణంలో 2023, జులై 1 నుంచి ఆన్‌లైన్ గేమింగ్ అప్లికేషన్లపై కేంద్ర ప్రభుత్వం టీడీఎస్ (మూలం వద్ద పన్ను) వర్తింపజేయాలని తాజాగా నిర్ణయించింది.

అయితే ఇప్పుడు ఈ నిర్ణయాన్ని కాస్త ముందుగానే అంటే 2023, ఏప్రిల్ 1 నుంచే ఆన్‌లైన్ గేమింగ్ అప్లికేషన్లపై టీడీఎస్ (టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్)( TDS ) వసూలు చేయడానికి రంగం సిద్ధమైంది.గేమింగ్ రంగానికి సంబంధించిన టీడీఎస్, జి యస్ టీలో మార్పులను పునఃపరిశీలించాల్సిందిగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, పీఎం కార్యాలయాన్ని ఆన్‌లైన్ గేమింగ్ ఇండస్ట్రీ వాటాదారులు అభ్యర్థనలు చేస్తుండగానే.తాజా నిర్ణయం వెలువడటం కొసమెరుపు.టీడీఎస్ కలెక్ట్ చేయాలనుకునే నిర్ణయం ప్రభుత్వం తన పన్ను ఆదాయాన్ని పెంచుకోవడానికే కాకుండా.ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు, ప్లేయర్లు ట్యాక్స్ రూల్స్‌కి కట్టుబడి ఉండేలా చేస్తుంది అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమపై ఈ మార్పు ప్రభావం గురించి కొన్ని పరిశ్రమ సంస్థలు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.దాంతో అంతకుమునుపు ఆయా పరిశ్రమ సంస్థలు ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాయడం కూడా జరిగింది.ఆ లేఖలో ఆన్‌లైన్ గేమింగ్‌ను జూదం, గుర్రపు పందెం, కాసినోల వలె పరిగణించరాదని అభ్యర్థించాయి.

ఎందుకంటే ఈ జూదం తరహా రంగాలు 28 శాతం జి యస్ టీ( GST ) చెల్లించాల్సి ఉంటుంది.దీన్ని సిన్ టాక్స్ గా పిలుస్తుంటారు.

ఈ రేంజ్‌లో జీఎస్టీ చెల్లించడం పెనుబారం అవుతుంది కాబట్టే సంస్థలు లేఖలో ఆ విధంగా అభ్యర్థించాయి.

Video : Online Games, Technology News, Latest News, Technology Updates, Tds, Paying, April 1st #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube