వన్ ప్లస్ 12R( Oneplus 12R ) కొత్త వేరియంట్ సేల్ మార్చి 21వ తేదీ నుండి ప్రారంభం అవ్వనుంది.OnePlus.in, OnePlus స్టోర్ యాప్, అమెజాన్ ల ద్వారా ఈ ఫోన్ కొనుగొలు చేయవచ్చు.
ఈ ఫోన్ ఫీచర్లు( Oneplus 12R Features ) ) ఏమిటో చూద్దాం.వన్ ప్లస్ 12R స్మార్ట్ ఫోన్: ఈ ఫోన్ 6.78 అంగుళాల AMOLED డిస్ ప్లే తో ఉంటుంది.120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ బ్రైట్ నెస్, 1264*2780 పిక్సెల్ రిజల్యూషన్, 360Hz టచ్ శాంప్లింగ్ ను కలిగి ఉంటుంది.కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణ తో ఉంటుంది.ఈ ఫోన్ ఆక్టా కోర్ 4nm స్నాప్ డ్రాగన్ 8జెన్ 2 SoC చిప్ సెట్ ను కలిగి ఉంది.
ఈ చిప్ 12GB లేదా 16GB Lpddr5x RAM, అడెన్నో 740 GPUతో జత చేయబడింది.గరిష్ఠంగా 1TB స్టోరేజ్ కలిగి ఉంటుంది.
![Telugu Smartphone, Oneplus, Oneplus Camera, Oneplus Offers, Oneplus Storage-Tech Telugu Smartphone, Oneplus, Oneplus Camera, Oneplus Offers, Oneplus Storage-Tech](https://telugustop.com/wp-content/uploads/2024/03/Oneplus-12R-New-Smartphone-Price-and-Specifications.jpg)
5000mAh బ్యాటరీ సామర్థ్యం( Oneplus 12R Battery )తో 100w super VOOC ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.ఈ ఫోన్ OIS,f/1.8 అపెచర్ తో 50ఎంపీ సోనీ IMX890 ప్రధాన కెమెరా, f/2.2 అపెచర్ తో 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, f/2.4 లెన్స్ తో కూడిన 2ఎంపీ మాక్రో లెన్స్ ను కలిగి ఉంటుంది.సెల్ఫీల కోసం 16ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఉంటుంది.
![Telugu Smartphone, Oneplus, Oneplus Camera, Oneplus Offers, Oneplus Storage-Tech Telugu Smartphone, Oneplus, Oneplus Camera, Oneplus Offers, Oneplus Storage-Tech](https://telugustop.com/wp-content/uploads/2024/03/Oneplus-12R-New-Smartphone-Price-and-Features.jpg)
ఈ స్మార్ట్ ఫోన్ ధర, ఆఫర్ల విషయానికి వస్తే.8GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.42999( Oneplus 12R Price ) గా ఉంది.అయితే వన్ కార్డు, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 తగ్గింపు పొందవచ్చు.ఎక్స్చేంజ్ ద్వారా రూ.3000 తగ్గింపు పొందవచ్చు.ఎక్సేంజ్ బోనస్ లో భాగంగా OnePlus నార్డ్ స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజి( Smartphone Exchange ) చేస్తే రూ.1000 అదనపు తగ్గింపు పొందవచ్చు.అంతేకాకుండా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద వన్ ప్లస్ 12R స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.4999 విలువైన వన్ ప్లస్ బడ్స్ Z2 ఉచితంగా పొందవచ్చు.ఈ ఫోన్ కొనుగోలుపై తొమ్మిది నెలల నో కాస్ట్ EMI ఆప్షన్ పొందవచ్చు.