కుటుంబానికి ఒకే టికెట్ అంటే.. మ‌రి బాబు కుటుంబం మాటేమిటీ..?

ఏపీ టీడీపీలో అధినేత చంద్ర‌బాబు పార్టీ బ‌లోపేతానికి బాగానే మార్పులు చేస్తున్నారు.ఈసారి న‌ల‌భై శాతం టికెట్లు యువ‌త‌కే ఇస్తామ‌ని కూడా చెప్పారు.

ఇక అప్పుడే ఎన్నిక‌లు అన్న‌ట్లు అంద‌రినీ స‌మాయ‌త్తం చేస్తున్నారు.జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు.

ఇక చిన‌బాబు లోకేష్ కూడా త్వ‌ర‌లోనే పాదయాత్ర చేప‌ట్ట‌నున్నారు.అయితే రీసెంట్ గా బాబు చ‌ర్చిస్తున్న అంశం ఒక కుటుంబానికి ఒకే టికెట్.

పార్టీలో సీనియ‌ర్లు.వార‌స‌త్వ రాజ‌కీయాలు లెక్క‌కు మించి ఉండ‌టంతో పార్టీని గాడీలో పెట్టే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

Advertisement

అయితే బాబు అనుకుంటున్న ఒక కుటుంబానికి ఒకే టికెట్.త‌మ‌కు కూడా వ‌ర్తిస్తుందా.? లేదా పార్టీ నేత‌ల‌కేనా.? అన్న ప్ర‌శ్న వినిపిస్తోంది.నిజానికి నాయ‌కుడు అన్న‌వారు పాటించి ఇత‌రుల‌ను పాటించ‌మంటే బాగుంటుంది.

కానీ అలా కాదు మాకో రూల్.మీకో రూల్ అంటే బెడిసికొట్టే అవ‌కాశాలు ఉన్నాయి.

వ‌ర్కౌట్ చేస్తారా.?

ఇక ఇంత‌టితో ఆగ‌కుండా గొడవలు.వివాదాలు పుట్టుకొస్తాయి.

దీంతో ప‌క్క చూపులు చూసే అవ‌కాశాలు కూడా ఉంటాయి.అయితే టీడీపీ అధినేత పార్టీని గాడిన పెట్టడానికి చాలానే చేస్తూ వస్తున్నారు.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

గతంలో కూడా ఆయన అలాగే చేశారు.గతంలో చేయాలని చూసి ప్రయత్నించి విఫలం అయిన ఫార్ములాలను మళ్లీ ఇప్పుడు అమ‌లు చేయాల‌నుకుంటున్నార‌ట.

Advertisement

అదే ఒక కుటుంబానికి ఒకే టికెట్. అయితే ఇలా ప్రతీ ఎన్నిక ముందూ చెబుతూ వస్తున్నదే.

అలాగే బయట వారికి టికెట్లు ఇవ్వమని ఇతర పార్టీల నుంచి జంప్ చేసి వ‌చ్చిన వారికి నో టికెట్ అని కూడా బాబు అంటూ ఉంటారు.కానీ ఆపరేషన్ ఆకర్ష్ మాత్రం ఆగ‌కుండా దూసుకెళ్తుంది.

మరో వైపు పనిచేసే వారికే టికెట్లు అంటారు.కానీ ఎన్నికల వేళకు ఫ్లైట్లు వేసుకుని దిగి వచ్చే వారికి అంగబలం అర్ధ బలం ఉన్న వారికే అవి దక్కుతాయ‌నేది కూడా తెలిసిందే.

యువ‌త‌కే అంటే.వార‌సులా.?

ఇక ఈసారి యువతకు టికెట్లు అని చాలా కాలనగా చంద్రబాబు చెబుతున్నారు.మరి ఆ యువత వారుసులా లేక నిజంగా పార్టీ కోసం కష్టపడిన నాయ‌కులా ఇప్పుడే తేలేలా లేదు.

ఇక ఇప్పుడు ఒక కుటుంబానికి ఒకే టికెట్ అంటూ పార్టీ సీనియర్లతో బాబు చర్చిస్తున్న విషయం అలా అలా పాకి పార్టీలో సీనియర్లకు ఆందోళ‌న పెంచుతోంద‌ట‌.ఎందుకంటే టీడీపీలో ఇపుడు చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి.

చంద్రబాబునే తీసుకుంటే ఆయనకు ఒక టికెట్ ఆయన కుమారుడు లోకేష్ కి ఒక టికెట్.బావమరిది బాలయ్యకు మరో టికెట్ గుడివాడలో ఎవరైనా నందమూరి ఫ్యామిలీ పోటీకి దిగితే ఇంకో టికెట్ ఇలా నాలుగు టికెట్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది.

చాలా కుటుంబాలే ఉన్నాయి మ‌రి.!

ఇలా రాష్ట్రం మొత్తంగా చూసుకుంటే ఇదే ప‌రిస్థితి క‌న‌బ‌డుతుంది.ఇక రాయలసీమ నుంచి శ్రీకాకుళం దాకా తీసుకుంటే టీడీపీ నేత‌ల కుటుంబాలే క‌నిపిస్తాయి.కర్నూల్ జిల్లా చూసుకుంటే కేఈ క్రిష్ణ మూర్తి బ‌డా నేత‌.

పైగా పవర్ వుల్ బీసీ నేత.ఆయన కుమారుడు శ్యాం బాబుకు ఒక టికెట్ కావాలి.తమ్ముడు కేఈ ప్రభాకర్ కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారు.

అలాగే కర్నూలులో కోట్ల కుటుంబానికి పెద్ద పేరు ఉంది.కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఈసారి లోక్ భకు పోటీ చేయాలని కోరుతుండగా ఆయన సతీమణి కోట్ల సుజాతమ్మ అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు.

అలాగే నంద్యాలలో భూమా ఫ్యామిలీదే ఆధిపత్యం.మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఆమె సోదరుడు బ్రహ్మానంద రెడ్డి టిక్కెట్ల రేసులో ఉన్నారు.

ఇలా ఇక్కడే చాలా పోటీ కనిపిస్తోంది.

ఎలా చూసుకున్నా టీడీపీలో అర్ధ సెంచరీ దాటేసిన ప్రముఖ కుటుంబాలు ఉన్నాయనే చెప్ప‌వ‌చ్చు.ఇలా తీసుకుంటే వంద టికెట్లు వీరికే ఇవ్వాలి.కట్ చేస్తే గ‌నుక‌ యాభై నుంచి అరవై ఇవ్వాలి.

అలా చేసినా వీరి నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందా అన్నదే పార్టీ ఆలోచిస్తోందిట.అయితే వ్య‌తిరేక‌త‌ను కూల్ చేసే మ్యాట‌ర్ ఏంటంటే.

బాబు లోకేష్ కి ఈ ఎన్నిక‌ల్లో టికెట్ కేటాయించ‌క‌పోవ‌డ‌మే.త‌న ఇంటి నుంచే ఈ కటింగ్ ని మొద‌లు పెడితే ఆదర్శంగా ఉంటుంది.

పైగా ఎవ‌రూ నోరు మెద‌ప‌రు కూడా.ఇక టీడీపీ అధికారంలోకి వ‌స్తే ఎలాగూ లోకేష్ ని సెట్ చేసే కార్య‌క్ర‌మం ఉంటుంది.

మొత్తానికి బాబు త‌న ఇంటినుంచే క‌టింగ్ మొద‌లు పెడితే బాగుంటుందిని.ఈ ఎన్నికలు టీడీపీకి కీల‌కం కావ‌డం వ‌ల్ల ఇలా చేస్తేనే బెట‌ర్ అని అంటున్నారు.

మ‌రి బాబు అలా కుద‌ర‌దు చిన‌బాబుకు టికెట్ ఇవ్వాల్సిందే అంటారా.చూడాల్సిందే.

తాజా వార్తలు