టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో నటి సమంత( Samantha ) ఒకరు.ఏ మాయ చేసావే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి సమంతా మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మదిని దోచుకుంది.
ఇలా హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి అతి తక్కువ సమయంలోనే ఎంతో పాపులారిటీ సొంతం చేసుకుంది.ఇక సమంత తెలుగులో స్టార్ హీరోలు అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్గా సక్సెస్ కావడమే కాకుండా తమిళంలో కూడా అగ్ర హీరోలు అందరి సరసన నటించారు.
సమంతకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సమంత ఇన్ని రోజులు అభిమానుల వద్ద ఓ విషయం దాచి ఉందని ఈమెకు ఒక చెల్లెలు( Sister ) కూడా ఉంది అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.సమంత నాగచైతన్య( Nagachaitanya ) లు పెళ్లి చేసుకునే సమయంలో ఎలాగైతే రెడీ అయి ఉందో అచ్చం అలాగే మరో అమ్మాయి సమంత పోలికలతోనే సమంత మాదిరిగానే రెడీ అయ్యి పెళ్లికూతురు గెటప్ లో కనిపించారు.
ఇలా పెళ్లికూతురు గెటప్ లో అచ్చం సమంతనే పోలి ఉంది.

సమంత తన పెళ్లి సమయంలో ఎలాంటి దుస్తులు ధరించింది, ఆమె ఎలాగైతే రెడీ అయ్యిందో ఆ అమ్మాయి కూడా అదే విధంగా రెడీ అయ్యి అలాంటి దుస్తులను ధరించారు.దీంతో ఈ అమ్మాయి ఫోటో చూసిన వారందరూ కూడా సమంత చెల్లెలు( Samantha Sister ) అంటూ కామెంట్లు చేస్తున్నారు.సమంతకు చెల్లెలు కూడా ఉందా ఇన్ని రోజులు ఈ విషయం చెప్పనే లేదే అంటూ సరదాగా నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఆ అమ్మాయి ఎవరు ఏంటి అనే పూర్తి వివరాలు మాత్రం తెలియడం లేదు.

ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అనే సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే అచ్చం సమంత పోలికలతో ఉన్నటువంటి ఈ అమ్మాయి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సమంత అభిమానులు ఈ ఫోటోలు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా మరింత వైరల్ చేస్తున్నారు.ఇక సమంత నాగచైతన్యను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
మూడు సంవత్సరాల తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు.

ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత వీరిద్దరూ కూడా తమ కెరియర్ పై ఫోకస్ పెట్టారు.ఇలా పెళ్లి చేసుకుని విడిపోయినటువంటి ఈ జంట రెండో పెళ్లి చేసుకోబోతున్నారనీ తరచూ వీరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ వీరిద్దరు మాత్రం ఈ వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు.ఇక సమంత ప్రస్తుతం మయోసైటిస్( Myositis ) వ్యాధికి గురి కావడంతో సినిమాలకు కాస్త విరామం ఇచ్చి ఈ వ్యాధి నుంచి బయటపడటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
త్వరలోనే ఈమె తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.