ఒకప్పుడు నగలు అమ్మాడు.. ఇప్పుడు సినిమాకు రూ.150 కోట్లు.. ఈ ప్రముఖ నటుడి గురించి తెలుసా?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీలుగా రాణిస్తున్న చాలామంది హీరోలు ఒకప్పుడు ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొన్న వారే.ఒక హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్ నటీనటులు చాలామంది ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

 Once Akshay Kumar Received Rs 150 As First Payment Sold Jewelry On The Streets,-TeluguStop.com

అలాంటి వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే హీరో కూడా ఒకరు.ఇంతకీ ఆ హీరో ఎవరు ఏంటి అన్న వివరాల్లోకి వెళితే… ప్రస్తుతం దేశ వ్యాప్తంగా స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న ఓ హీరో, ఒకప్పుడు వీధుల్లో నగలు అమ్మి డబ్బు సంపాదించాడు.

ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న బాలీవుడ్( Bollywood ) హీరోల్లో ఒకరిగా నిలుస్తున్నాడు.

Telugu Akshay Kumar, Bollywood, Delhi, Sold Jewelry, Streets, Tollywood-Movie

ఆ యాక్టర్ ఎవరో కాదు, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్( Akshay Kumar ) తన అద్భుత నటనతో ఎన్నో బ్లాక్‌ బస్టర్లను అందుకొని విలాసవంతమైన జీవితం గడుపుతున్న అక్షయ్, సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టకముందు ఎన్నో కష్టాలను అనుభవించాడు.వివిధ నగరాల్లో కూలీగా పనిచేశాడు.వీధుల్లో గిల్ట్ నగలు అమ్మాడు.

ఇప్పుడు బాలీవుడ్‌ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకడు.ఒక్కో సినిమాకు రూ.కోట్లలో పారితోషికం తీసుకుంటున్నాడు.రూ.80 కోట్ల విలువైన విలాసవంతమైన భవంతిలో నివసిస్తున్నాడు.ఆయన గ్యారేజీలో లగ్జరీ కార్లకు కొదవలేదు.

Telugu Akshay Kumar, Bollywood, Delhi, Sold Jewelry, Streets, Tollywood-Movie

కాగా అక్షయ్ కుమార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన జర్నీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.15 ఏళ్ల వయసు నుంచి పని చేయడం ప్రారంభించాను.కలకత్తాలోని ఒక ట్రావెల్ ఏజెన్సీలో హెల్పింగ్ బాయ్‌గా పని చేశాను.నా మొదటి జీతం రూ.150.బతుకుదెరువు కోసం ఎన్నో పనులు చేశాను.ఢిల్లీ( Delhi ) వీధుల్లో నగలు అమ్మాను.ఆ తర్వాత ఢాకాకు వెళ్లాను.అక్కడ ఒక హోటల్‌లో పనిచేశాను.తర్వాత బ్యాంకాక్‌ వెళ్లాను.

ఢిల్లీలో నగలు కొని ముంబైలో అమ్మేవాడిని.గిల్ట్ నగలను ఢిల్లీలో రూ.20,000కి కొనుగోలు చేసి, వాటిని ముంబైలో రూ.24,000 అమ్మాను అని తెలిపారు అక్షయ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube