నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.నియోజకవర్గ పరిశీలకుడు సత్యనారాయణ రెడ్డి ముందు ఎమ్మెల్యే ఆనం ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం.
తాను ఎమ్మెల్యేనా.? కాదా.? అన్నది క్లారిటీ ఇవ్వాలని ఆనం కోరారు.అనంతరం వెంకటగిరికి కొత్త ఎమ్మెల్యేను పెట్టేశారా అని సత్యనారాయణ రెడ్డిని ప్రశ్నించారు.
నియోజకవర్గంలో సమన్వయ లోపం ఉందన్న ఆనం తాను ఉండగానే మరొకరు కాబోయే ఎమ్మెల్యేనని చెప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు.వచ్చే ఎన్నికలకు ఇప్పుడే కుర్చీ లాగేస్తున్నారని అని వాపోయారు.
అయితే నిన్న కూడా ఏపీ ప్రభుత్వంపై ఆనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.