మరోసారి తెలంగాణ ప్రభుత్వం పై సీరియస్ అయిన హైకోర్టు..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాక్సినేషన్ డ్రైవ్ ఎందుకు ఆపేసింది అంటూ హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది.

దేశంలో ఇతర రాష్ట్రాలలో వాక్సినేషన్ డ్రైవ్ నిక్షేపంగా జరుగుతుంటే తెలంగాణలో ఎందుకు నిలిపివేశారు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

తెలంగాణ రాష్ట్రంలో మహమ్మారి కరోనా విషయంలో న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేసిన పిటిషనర్లు వాక్సినేషన్ డ్రైవ్ లో తెలంగాణ దేశంలో 15వ స్థానంలో ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.రాష్ట్రంలో వైరస్ విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ఒకలా ఉంటే వాస్తవంగా వేరేలా ఉన్నాయని తెలిపారు.

Once Again, The High Court Is Serious About The Telangana Government, High Court

అదే విధంగా పడకల సంఖ్య ప్రభుత్వ వెబ్ సైట్ లో ఒక రకంగా బయట మరో రకంగా ఉందని.హాస్పిటల్స్  వసూలు చేస్తున్న ఛార్జీలు కూడా అదేరీతిలో ఉన్నాయని .  ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ పనితనం ఏమీ బాగోలేదు అని పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.పరిస్థితి ఇలా ఉండగా కరోనా పరీక్షల విషయంలో ధరలు నియంత్రించాలని కోరారు.

ఈ నేపథ్యంలో హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో గతంలో ఇచ్చిన జీవోను పునరుద్ధరించాలని సూచించడం జరిగింది.అంత మాత్రమే కాక ప్రైవేట్ హాస్పిటల్ దందాపై ముగ్గురు సభ్యుల కమిటీని వెంటనే నియమించాలని పేర్కొంది.

Advertisement

  .

షూటింగ్ కోసం వెళ్లి చిక్కుకున్న బాలకృష్ణ ,కృష్ణం రాజు..బిస్కట్స్, చేపలతో ప్రాణం కాపాడుకున్నారు
Advertisement

తాజా వార్తలు