ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది.రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోవడం లేదని పార్లమెంట్ లో వెల్లడించింది.
ప్రత్యేక హోదా ముగిసిన అంశమన్న 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకే ఈ నిర్ణయమని కేంద్రం తెలిపింది.ఆర్థిక లోటు భర్తీకి 14వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించిందని ప్రకటించింది.
ప్రత్యేక రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలకు మధ్య అంతరం తొలగిపోయిందని తెలిపింది.ఈ క్రమంలోనే హోదాకు బదులుగా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించామని కేంద్రం స్పష్టం చేసింది.