మరోసారి హైదరాబాద్‎లో శేజల్ ఆత్మహత్యాయత్నం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న శేజల్ మరోసారి హైదరాబాద్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

జూబ్లిహిల్స్ లోని పెద్దమ్మ గుడి దగ్గర స్పృహ తప్పి పడిపోయింది.

శేజల్ ను గమనించిన స్థానిక వ్యక్తులకు పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న శేజల్ ను ఆస్పత్రికి తరలించారు.

కాగా శేజల్ బ్యాగులో నిద్రమాత్రలు లభించాయని సమాచారం.అయితే ఇప్పటికే ఆమె ఢిల్లీలో కూడా ఓ సారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే.

మనుషులను అంచనా వేయడంలోనూ వేణుస్వామి తోపు.. బిగ్‌బాస్ నెక్స్ట్ సీజన్ గెలిచేస్తారా..? 
Advertisement

తాజా వార్తలు