వరలక్ష్మి శరత్ కుమార్ కు ఘోర అవమానం.. అది మగాడిలా ఉందంటూ?

హీరోయిన్లకు బాడీ షేమింగ్( Body Shaming ) లాంటి అవమానాలు ఇండస్ట్రీలో బాగా ఎదురవుతూ ఉంటాయి.ఇవి చాలా కామన్ అని చెప్పాలి.

 Varalakshmi Sarath Kumar Sensational Comments About Her Film Journey Viral In So-TeluguStop.com

ఇప్పటికీ చాలా మంది హీరోయిన్ లు ఒక బాడీ షేమింగ్ విషయంలోనే కాకుండా ఇతర విషయాలలో కూడా బాగా కామెంట్స్ ఎదురుకుంటూ ఉంటారు.కానీ కొన్ని కొన్ని సార్లు ఆ అవమానాలే వారికి బలంగా నిలుస్తాయి.

ఆ బలంతోనే వాళ్ళు ఒక హోదాకి కూడా చేరుకుంటారు.అయితే గతంలో వరలక్ష్మి శరత్ కుమార్ ను కూడా ఘోరంగా అవమానించారు.

ఇంతకు తనను ఏ విషయంలో అవమానించారు తెలుసుకుందాం.

Telugu Tollywood, Trolls-Movie

హీరోయిన్ క్యారెక్టర్ కంటే నెగిటివ్ రోల్( Negative Role ) లో మంచి పేరు సంపాదించుకుంది వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు ప్రేక్షకులతో మంచి పరిచయం పెంచుకుంది.కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా నటించింది.ఈమె 2012 తమిళ సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ తర్వాత మలయాళం, కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టి.2019లో తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది.

గతంలో క్రాక్, నాంది సినిమాలో నటించి తన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.ఇక యశోద సినిమాలో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ నెగటివ్ రోల్ చేసింది.

ఇక వీరసింహారెడ్డి సినిమా( Veerasimha Reddy )లో మాత్రం బాలకృష్ణ కు పోటీగా నిలిచింది వరలక్ష్మి శరత్ కుమార్.ఈ సినిమాలో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఏకంగా విమర్శకులు సైతం ఫిదా అయ్యారు.

ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

Telugu Tollywood, Trolls-Movie

తెలుగు ప్రేక్షకులను కూడా తన ఫాలోవర్స్ గా మార్చుకుంది.అప్పుడప్పుడు తన డాన్స్ వీడియోలతో కూడా బాగా ఫిదా చేస్తుంది. పొట్టి పొట్టి బట్టలు( Varalashmi Hot Photoshoot ) వేస్తూ అందరిని బాగా ఆకట్టుకుంటుంది.

ఇక ప్రస్తుతం ఆమె వరుస సినిమాలలో చేస్తూ బాగా బిజీగా ఉంది.ఇక గతంలో కాస్త బొద్దుగా ఉన్న వరలక్ష్మి ఇప్పుడు బాగా సన్నబడి బాగా ఫోటోలు షేర్ చేసుకుంటూ ఉంటుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే కెరీర్ మొదట్లో ఈమెకు ఘోరంగా అవమానం జరిగిందట.తన కెరీర్ మొదట్లో తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటాను అన్నప్పుడు ఆ సమయంలో తనను కొందరు డైరెక్టర్లు నీ గొంతు బాగోలేదని.

మగ రాయుడిలా ఉందని అవమానించారట.ఆ సమయంలో చాలా బాధపడ్డాను అని తెలిపింది.

Telugu Tollywood, Trolls-Movie

కానీ కొన్ని రోజులకే తన గొంతుకి కూడా తన నటనతో ఈక్వల్ గా అభిమానులు ఏర్పడ్డారని.ఇప్పుడు తన గొంతుకి కూడా పిచ్చ ఫాన్స్ ఉన్నారని తెలిపింది.కేవలం తనే కాదు సినిమా ఇండస్ట్రీలో కొందరు పనికిమాలిన బిహేవియర్ కారణంగా.కొందరు స్టార్స్ చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పుకొచ్చింది.ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube