భారత్‌తో ‘‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’’ (ఎఫ్‌టీఏ)( Free Trade Agreement )కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు యూకే ప్రధాని రిషి సునాక్.దీనిపై తన నిబద్ధతను ఆయన మరోమారు పునరుద్ఘాటించారు.
ఈ ఏడాది సెప్టెంబర్ జీ20 సమ్మిట్ కోసం న్యూఢిల్లీకి రిషి సునాక్ రానున్నారు.లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని గార్డెన్‌లో ఇండియా గ్లోబర్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన యూకే ఇండియా వీక్ 2023ని పురస్కరించుకుని రిషి సునాక్( PM Rishi Sunak ) ప్రత్యేక రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు.
ఇండో యూకే( Indo UK )ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను పెంపొందించడానికి ప్రధాని నరేంద్ర మోడీ, తాను కృషి చేస్తున్నట్లు చెప్పారు.

రిసెప్షన్ సందర్భంగా భారత్‌కు చెందిన బాక్సింగ్ ఛాంపియన్ మేరీకోమ్, సంగీత విద్యాంసులు శంకర్ మహదేవన్ , జాకీర్ హుస్సేన్, బాలీవుడ్ తారలు సోనమ్ కపూర్, వివేక్ ఒబెరాయ్( Vivek Oberoi )లతో పాటు పలువురు ప్రముఖులను కలిశారు.ఆయన వెంట సతీమణి అక్షతా మూర్తి కూడా వున్నారు.ఈ సందర్భంగా రిషి సునాక్ మాట్లాడుతూ.
ఇరు దేశాలకు ప్రయోజనం చేకూర్చే వాణిజ్య ఒప్పందం సాకారమయ్యేలా కృషి చేస్తామన్నారు.రాబోయే రోజుల్లో ప్రపంచం దృష్టి భారతదేశంపై వుంటుందని రిషి పేర్కొన్నారు.
ఇరు దేశాలు గతంలో కంటే దగ్గరగా వున్నాయని.కింగ్ ఛార్లెస్ పట్టాభిషేకం సమయంలోనూ భారత సంతతికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారని ప్రధాని తెలిపారు.

కాగా.భారత్, యూకేలు ఇటీవల పదవ రౌండ్ ఎఫ్‌టీఏ చర్చలను విజయవంతంగా ముగించాయి.త్వరలోనే 11వ రౌండ్ చర్చలు ప్రారంభం కానున్నాయి. ఇండియా గ్లోబల్ ఫోరమ్ (ఐజీఎఫ్)( India Global Forum ) ఐదవ వార్షిక యూకే ఇండియా వీక్ శుక్రవారం వరకు జరగనుంది.
ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి సారించే కీలక రంగాలపై చర్చించడానికి మంత్రులు, వ్యాపార నాయకులు, విధాన రూపకర్తలను ఒకచోట చేర్చింది.
ఇకపోతే.
రిషి సునాక్ ‘‘పెన్ను’’ వివాదంలో ఇరుక్కున్నారు.ఎరేజబుల్ ఇంక్( Erasable Ink Pen )తో వున్న పెన్నును ( పైలట్ వి) వాడటమే ఇందుకు కారణం.
ఈ పెన్నుతో రాసిన అక్షరాలను చెరిపివేసే సదుపాయం వుండటంతో, దీనిని వాడటం సురక్షితం కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.రిషి సునాక్ ఈ పెన్నును వినియోగిస్తూ వుండటంతో ఆయన రాసిన అంశాలను ఎవరైనా చెరిపివేసే అవకాశం వుంటుందని మేధావులు ఆందోళన చెందుతున్నారు.








