ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు దూరంగా ఉండనున్నారు.ఈ మేరకు ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు ఆయన గైర్హాజరు కానున్నారు.
ఇవాళ విచారణకు హాజరుకావాలని ఈడీ కేజ్రీవాల్ కు మూడు రోజుల క్రితం నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.ఢిల్లీ మద్యం కుంభకోణం( Delhi Liquor Scam ) కేసులో కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు ఇప్పటివరకు ఐదుసార్లు నోటీసులు అందించారు.
అయితే గత నాలుగు నెలలుగా ఈడీ ఇస్తున్న నోటీసులను పట్టించుకోని కేజ్రీవాల్( Arvind Kejriwal ) అక్రమంగా తనకు నోటీసులు ఇస్తున్నారంటూ మండిపడ్డారు.మరోవైపు ఈడీ నోటీసులను ఆప్ లాయర్ల బృందం అధ్యయనం చేస్తుంది.అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ ( BJP )కార్యాలయం ఎదుట ఇవాళ ధర్నాకు హాజరుకానున్నారు.చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ మోసం చేసిందంటూ ఆప్, కాంగ్రెస్ ఆరోపిస్తుంది.ఎన్నికల అధికారి బ్యాలెట్ పేపర్లను ట్యాంపరింగ్ చేశారని మండిపడుతోంది.కాగా ఇవాళ బీజేపీ ఆఫీస్ ఎదుట చేస్తున్న ధర్నాకు కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ కూడా హజరుకానున్నారు.