మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ‘సాక్షి’ చిత్రం నుంచి నాగబాబు ఫస్ట్ లుక్ విడుదల

సూపర్‌స్టార్ కృష్ణ‌, విజ‌య‌నిర్మల ఫ్యామిలీ నుంచి శ‌రణ్ కుమార్ హీరోగా ప‌రిచయం అవుతున్న సాక్షి సినిమాలో హీరో లుక్ ఇది వరకే రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది.సూప‌ర్‌స్టార్ కృష్ణ విడుద‌ల చేసిన ఫస్ట్ లుక్ మంచి ఆదరణ దక్కించుకుంది.శివ కేశ‌న కుర్తి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెన్నెల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.3గా మునగాల సుధాక‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.నేడు (ఆగస్ట్ 22) మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి నాగబాబు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

 On The Occasion Of Megastar Chiranjeevi's Birthday, Nagababu's First Look From T-TeluguStop.com

సాక్షి టైటిల్ లోగోను, విలన్‌గా నటిస్తున్న నాగబాబు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు గారు, బెక్కెం వేణు గోపాల్ గారు, దాము గారు సంయుక్తంగా విడుదల చేశారు.

అనంతరం నిర్మాత మునగాల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ చిత్రానికి సంబంధించిన విశేషాలు పంచుకున్నారు.నిర్మాత మునగాల సుధాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ .‘అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మా సాక్షి సినిమాలో విలన్‌గా నటించిన నాగబాబు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ లోగోను రిలీజ్ చేసిన నిర్మాతలు దిల్ రాజు గారికి, బెక్కెం వేణు గోపాల్ గారికి, దాము గారికి చాలా థాంక్స్.వారు మా సినిమా కోసం ముందుకు రావడం నాకు ఆనందంగా ఉంది.

సినిమా చాలా బాగా వచ్చింది.విజయ నిర్మల గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన శరణ్ హీరోగా నటిస్తున్నారు.

హీరోయిన్ జాహ్నవి కపూర్.నాగబాబు గారు మెయిన్ విలన్‌గా ముఖ్యమైన పాత్రలో నటించారు.

అజయ్, ఇంద్రజ, ఆమని గారు ఇలా పెద్ద క్యాస్టింగ్‌తో సినిమా మీ ముందుకు రాబోతోంది.భీమ్స్ గారి సంగీతం బాగా వచ్చింది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంద’ని అన్నారు.

న‌టీన‌టులు:

శ‌ర‌ణ్ కుమార్‌, జాహ్నవి కపూర్

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్‌: శ్రీ వెన్నెల క్రియేష‌న్స్‌ స‌మ‌ర్ప‌ణ‌: బేబీ ల‌లిత‌ నిర్మాత‌: మునగాల సుధాక‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం: శివ కేశ‌న కుర్తి సినిమాటోగ్ర‌ఫీ: చైత‌న్య కందుల‌ మ్యూజిక్‌: భీమ్స్ సిసిరోలియో ఆర్ట్‌: కె.వి.ర‌మ‌ణ‌ ఎడిట‌ర్‌: సెల్వ కుమార్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube